స్కిన్ కేర్ మిస్టేక్స్.. మేకప్‌తో నిద్రపోవడం మంచిది కాదంటున్న నిపుణులు
ఎంత కేర్ తీసుకుంటున్నప్పటికీ ఫేస్‌లో షైనింగ్ ఉండట్లేదా? ఆయిలీ లేదా
దిశ, ఫీచర్స్ : ఎంత కేర్ తీసుకుంటున్నప్పటికీ ఫేస్‌లో షైనింగ్ ఉండట్లేదా? ఆయిలీ లేదా డ్రై స్కిన్‌తో ఇబ్బందిపడుతున్నారా? మాయిశ్చరైజర్స్ అప్లయ్ చేసినా లాభం లేదా? యూ డోంట్ వర్రీ. ఇవన్నీ మీ స్కిన్‌కేర్ మిస్టేక్స్ వల్ల తలెత్తే సమస్యలు కావచ్చు అంటున్నారు స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్. కొందరికి డైలీ స్కి్న్ కేర్ హ్యాబిట్స్ లేకపోవడంవల్ల కూడా ఇలా జరగవచ్చు. చర్మం కందిపోవడం, మొటిమలు తరచూ రిపీట్ అవడం, స్కిన్ డల్‌నెస్‌కు గురవడం, కంటి కింద నల్లటి సర్కిల్స్ ఏర్పడటం వంటి ప్రాబ్లమ్స్ ఏర్పడొచ్చు. అయితే ఇందుకు కారణమైన స్కిన్ కేర్ మిస్టేక్స్ గుర్తించి.. సరైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటించడం వల్ల వీటికి చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
క్లీనింగ్ అండ్ ఎక్స్‌ఫోలియేటింగ్
మీరు మేకప్ రిమూవల్‌లో శ్రద్ధ వహించినప్పటికీ సరైన పదార్థాలతో కూడిన క్లెన్సర్‌ని యూజ్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారో లేదో నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో మీ రిమూవల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి, రంధ్రాలను క్లియర్ చేయడంలో సహాయపడే సాలిసిలిక్ యాసిడ్‌ను కలిగి ఉండాలి. అలాగే ఓవర్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఉత్సాహం కలిగించవచ్చు. కానీ లాంగ్ టెర్మ్ డ్యామేజ్‌ను కలిగిస్తుంది. అలా చేయడంవల్ల వాస్తవానికి స్కిన్ ప్రొటెక్టివ్ బారియర్‌ను తొలగిస్తున్నట్లే లెక్క. ఇది ఎన్విరాన్‌మెంటల్ టాక్సిన్ అండ్ స్కిన్ డ్యామేజ్‌ను కలిగిస్తుంది. వారానికి గరిష్టంగా రెండు నుంచి మూడు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం బెటర్.
స్లీపింగ్ విత్ మేకప్, ప్రొడక్ట్ అప్లయింగ్
చాలామంది చేసే సాధారణ పొరపాట్లలో ఒకటి మేకప్ తీయకుండానే నిద్రపోవడం. ఏదో ఒకసారి ఇలా జరిగితే పర్వాలేదు. కానీ అదొక హాబీగా మారకూడదు. రాత్రిపూట మేకప్‌ను తొలగించకపోవడం వల్ల చర్మ రంధ్రాలు లేదా ఆయిల్ గ్లాండ్స్ మూసుకుపోతాయి. ఫలితంగా మొహంపై నీట్‌నెస్, స్మూత్ నెస్ దెబ్బతింటుంది. గరుకు చర్మం ఏర్పడుతుంది. మరొక మిస్టేక్ ఏంటంటే.. కొందరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను యూజ్ చేస్తుంటారు. కానీ ఆర్డర్ వైజ్ ఉండదు. కాబట్టి మీ నియమావళిలో గల ప్రొడక్ట్స్‌లోని బెనిఫిట్స్‌ను పూర్తిగా పెంచడానికి, మందమైన వాటి కంటే ముందుగా సన్నని, అనుకూలమైన ప్రొడక్ట్స్‌ను అప్లయ్ చేయడం బెటర్. అలాగే కొందరు మేకప్ బ్రష్‌ను ఏళ్ల తరబడి యూజ్ చేస్తుంటారు. ఇవి ఇన్ఫెక్షన్స్, అలర్జీలకు దారితీస్తాయి. కాబట్టి డర్టీ మేకప్ బ్రష్‌ను అవాయిడ్ చేయాలి. క్లీన్‌గా ఉంచుకోవడంవల్ల ఓల్డ్ మేకప్ బ్రష్ అయినా మీ స్కిన్‌పై నెగెటివ్ ఎఫెక్ట్ చూపదు.
సన్‌స్క్రీన్, పిల్లోకేస్, రబ్బింగ్
చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయడంలో మంచి సన్‌స్క్రీన్ అప్లయ్ చేయడం మేలు చేస్తుంది. ఇది వింటర్‌లో కూడా ప్రతిరోజూ ఉపయోగించాలి. దీనికి 30 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉందని నిర్ధారించుకోండి. అలాగే డైలీ మీ చెస్ట్‌పై, చేతుల పైభాగానికి అప్లై చేయడం మర్చిపోవద్దు. అలాగే కొందరికి మందమైన కాటన్ పిల్లోకేస్ మీద పడుకోవడం ఇబ్బంది కలిగించవచ్చు. ముఖాన్ని నిరంతరం దిండుతో తాకడంవల్ల ఏర్పడే రాపిడితో కొందరి స్కిన్ ఎర్రగా మారవచ్చు. అవసరమైతే సిల్క్ పిల్లో కేస్‌కు మారండి. ఎందుకంటే అవి శాశ్వత మడతలు, రంగు సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కొందరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను గట్టిగా రుద్దుతూ అప్లయ్ చేస్తుంటారు. ఈ మిస్టేక్ వల్ల స్కిన్ దెబ్బతింటుంది. పింపుల్స్, ఇన్ఫెక్షన్స్ తలెత్తుతుంటాయి. బీ కేర్ ఫుల్.
ఆయిలీ స్కిన్, ఓవర్ యూజింగ్ ప్రొడక్ట్స్
వివిధ స్క్రబ్‌లతో ఎక్స్‌ఫోలియేట్ చేస్తే జిడ్డు చర్మం లేదా ఆయిలీ స్కిన్‌ని తొలగించగలమని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ మిస్టేక్ వల్ల ఇబ్బందులు వస్తాయి. స్కిన్‌ను ఎక్కువగా స్క్రబ్ చేసినప్పుడు దాని నేచురల్ రిపేర్ మెకానిజం ఓవర్‌డ్రైవ్‌లో పడిపోతుంది. జిడ్డు అనేది మరింత వేగంగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వారానికి రెండుసార్లు స్ర్కబ్ చేస్తే చాలు. అలాగే అతిగా స్క్రబ్బింగ్ చేసినట్లే, మీ క్లెన్సర్ లేదా ఇతర ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా స్కిన్ నేచురల్ ప్రొటెక్టివ్ ఆయిల్ కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి ప్రతీరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అతిగా శుభ్రపరచడం అవసరం లేదు. డర్ట్, ఆయిల్ అండ్ మేకప్‌ను తొలగించడానికి సాయంత్రం శుభ్రపరచడం చాలా ముఖ్యం.