గ్యాస్ దగ్గర మీరు చేస్తున్న మిస్టేక్స్ ఇవే... ఇకనైనా జాగ్రత్తగా ఉండండి..
గ్యాస్ స్టవ్‌లు దాదాపు ప్రతి భారతీయ వంటగదికి హృదయం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఫుడ్ తింటూ యమ్మీ అనే మనం అయ్యో అనాల్సి వస్తుంది.
దిశ, ఫీచర్స్ : గ్యాస్ స్టవ్‌లు దాదాపు ప్రతి భారతీయ వంటగదికి హృదయం. కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఫుడ్ తింటూ యమ్మీ అనే మనం అయ్యో అనాల్సి వస్తుంది. అందుకే వంట గదిని, ఇంటిని, ఇంటి సభ్యులను సురక్షితంగా ఉంచే కొన్ని టిప్స్ అందిస్తున్నారు నిపుణులు.
ప్రతి సారి బర్నర్స్ చెక్ చేయండి
వంట చేసిన తర్వాత హడావిడిలో బర్నర్ ఆఫ్ చేయడం మరిచిపోవచ్చు. కాబట్టి ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయడం ముఖ్యం. స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు బర్నర్ వెలగకపోతే విస్మరించకూడదు. అలా జరిగితే.. దాన్ని ASAP ఆఫ్ చేసి విండోను తెరిచి, మళ్లీ ప్రయత్నించే ముందు కొంచెం వేచి ఉండండి. భద్రత ముఖ్యం.
పరిశుభ్రత
శుభ్రం చేయడం ఇష్టముండదని తెలుసు కానీ.. మురికితో కూడిన పొయ్యి మనం అనుకున్నదానికంటే ప్రమాదకరం. ఆహార కణాలు, గ్రీజు బర్నర్‌ను మూసుకుపోయేలా చేస్తాయి. సంభావ్య గ్యాస్ లీక్‌లకు దారితీస్తాయి. అందుకే ప్రతిసారి గ్యాస్ స్టవ్ వినియోగించాక తడి గుడ్డతో త్వరితగతిన తుడిచివేయడం మంచిది. మొండి మరకలు ఉన్నట్లయితే.. కొద్దిగా సబ్బు, స్క్రబ్ తో శుభ్రం చేయండి.
వస్తువులతో ఇబ్బందే
మంటలు అంటుకునే వస్తువులు ఏవీ స్టవ్ దగ్గర పెట్టకూడదు. ప్లాస్టిక్ కవర్లు, చెక్క చెంచాలు, టవల్స్, మందు సీసాలు దరిదాపుల్లో ఉండకూడదు. అన్ని వస్తువులను మంటలకు దూరంగా ఉంచండి. వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు.. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఈ నియమాన్ని ఫాలో కావాలి.
వదులైన బట్టలు వద్దు
వంట చేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించకూడదు. ఇవి మంటలు అంటుకునేందుకు కారణం కావచ్చు. కాబట్టి మీకు సరిగ్గా సెట్ అయ్యే దుస్తులను వేసుకోండి. పాలిస్టర్, సింథటిక్ క్లాత్స్ కు ఫ్యాబ్రిక్‌లను ధరించవద్దు. పొడవాటి జుట్టు ఉంటే.. వంట ప్రారంభించే ముందు దానిని బన్ లేదా పోనీటైల్‌లో కట్టుకోండి. జుట్టు + అగ్ని కాంబో అస్సలు మంచింది కాదు.