సంపూర్ణ ఆరోగ్యానికి పుల్లని ఆహారాలు.. రోజూ తింటే ఏ రోగం దరిచేరదు..

నిమ్మకాయ, నారింజ, పచ్చని ఆపిల్, పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలు.. పులుపు రుచిని కలిగి ఉంటాయి. సిట్రిక్, ఎసిటిక్, లాక్టిక్ యాసిడ్ వంటి సేంద్రీయ ఆమ్లాలు ఉండటం వల్ల

Update: 2024-09-29 18:22 GMT

దిశ, ఫీచర్స్ : నిమ్మకాయ, నారింజ, పచ్చని ఆపిల్, పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలు.. పులుపు రుచిని కలిగి ఉంటాయి. సిట్రిక్, ఎసిటిక్, లాక్టిక్ యాసిడ్ వంటి సేంద్రీయ ఆమ్లాలు ఉండటం వల్ల ఇవి ఈ టేస్ట్ తో ఉంటాయి. కాగా వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుందని సూచిస్తున్న నిపుణులు.. వీటివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.

మెరుగైన జీర్ణక్రియ

2012లో ప్లస్ వన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం పెరుగు వంటి ఆహార పదార్థాలను పులియబెట్టేటప్పుడు ఉత్పత్తి చేయబడిన ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. పుల్లని ఆహారాలు లాలాజలం, జీర్ణ రసాలను కూడా ప్రేరేపిస్తాయి, జీర్ణక్రియ, పోషకాల శోషణకు సహాయపడతాయి. ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతాయి.

పుష్కలమైన విటమిన్ సి

సిట్రస్ పండ్లు వంటి అనేక పుల్లని ఆహారాలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐరన్ శోషణను పెంచుతుంది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. వంద గ్రాముల నిమ్మకాయలో 53 mg విటమిన్ సి ఉంటుంది . అలాగే USDA ప్రకారం.. వంద గ్రాముల నారింజలో 53.2 mg విటమిన్ సి ఉంటుంది.

గుండె జబ్బులను తగ్గించవచ్చు

పుల్లని ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన 2019 అధ్యయనంలో పెరుగు వినియోగం, తక్కువ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదానికి మధ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

బరువు నిర్వహణ

పుల్లని ఆహారాలు కోరికలను అరికట్టడానికి, కడుపు నిండిన అనుభూతిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. తద్వారా వెయిట్ మేనేజ్మెంట్ లో ప్రయోజనకరంగా ఉంటాయి. 2017లో క్రిటికల్ రివ్యూస్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం ఊబకాయం ఉన్నవారిలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నోటి ఆరోగ్యం మెరుగు

పుల్లని ఆహారాల ఆమ్లత్వం నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది. నోటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ వాటిని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే అవి పంటి ఎనామెల్‌ను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు.

రక్తంలో చక్కెర నియంత్రణ

పుల్లని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 2015లో ఎండోక్రైన్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్‌లో రివ్యూస్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. సోర్ చెర్రీస్ వంటి పుల్లని ఆహారాలలో ఆంథోసైనిన్స్ అనే రసాయనం ఉంటుంది, ఇది టైప్ 2 డయాబెటిస్‌ నుంచి రక్షిస్తుంది.

హైడ్రేషన్

సిట్రస్ పండ్ల వంటి అనేక పుల్లని ఆహారాలు అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి పండ్లు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడతాయి. శరీరంలో మొత్తం ద్రవ సమతుల్యతను కూడా మెయింటెయిన్ చేస్తాయి.

Tags:    

Similar News