Brestfeeding tips: ఏడాది దాటిన పిల్లలు తల్లిపాలు మానట్లేదా?బెస్ట్ చిట్కాలివే?

పుట్టిన ప్రతిబిడ్డకు తల్లిపాలు అనేది ముఖ్యమైనవి.

Update: 2024-09-23 08:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుట్టిన ప్రతిబిడ్డకు తల్లిపాలు అనేది ముఖ్యమైనవి. వారికి తల్లిపాలే సరైన ఆహారం. తల్లిపాల వల్ల బిడ్డకు పోషకాలు అందడమే కాకుండా.. శిశువులోని అభివృద్ధి చెందుతున్న కడుపు, ప్రేగులు ఇతర శరీర భాగాలకు మేలు చేస్తాయి. అదనపు కేలరీలను బర్న్ చేయడంలో తోడ్పడుతాయి. ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతాయి. పిల్లలను దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతాయి. శిశువును రక్షించడంలో మేలు చేస్తాయి. తల్లిపాలు తాగితే పిల్లలకు ఊబకాయం, ఆస్తమా,టైప్ 1 మధుమేహం.. ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.


నిపుణులు చెప్పిన బెస్ట్ చిట్కాలు..

తల్లిపాలు తాగే శిశువులకు చెవి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. బేబీకి 6 నెలల వయస్సు వచ్చే వరకు మీరు తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి అని డాక్టర్లు చెప్పిన మాటని తెలిసిందే. పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచే తల్లిపాలు కొంతమంది పిల్లలు సంవత్సరం దాటాక కూడా తాగుతారు.దీంతో తల్లులు పిల్లలకు పాలు మాన్పించాలనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది సాధ్యం అవ్వదు. పైగా ప్రస్తుత రోజుల్లో ఉద్యోగ బాధ్యలు, కుటుంబాన్ని చూసుకోవడం .. ఇలా పిల్లలకు పాలు పట్టించేంత తీరిక కూడా దొరకట్లేదు. అయితే ఏడాది దాటాక మీ పిల్లలు పాలు తాగడం పాలు మానుకోకపోతే నిపుణులు చెప్పిన ఈ బెస్ట్ చిట్కాలు ఫాలో అవ్వండి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నిర్ణయానికి కట్టుబడి ఉండటం..

మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఒకసారి పాలివ్వడం ఆపాక పిల్లలు ఏడ్చినా, అరిచినా, తాగేందుకు ప్రయత్నించినా సరే మీరు వెంటనే కరిగిపోవద్దు. నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే పాలు మాన్పించడం కష్టమవుతుంది. పాలు ఇవ్వడం స్టాప్ చేశాక పిల్లల ప్రవర్తన మారిపోతుంది. కాగా ప్రత్యామ్నాయ దారిని వెతకండి. పాల డబ్బాలు, సిప్పర్ లు పిల్లలకు అలవాటు చేయడం మంచిది. అలాగే పిల్లలు ఏ ఆహారాన్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతున్నారో గ్రహించి.. రుచికరమైన ఫుడ్ పెట్టండి.

ఒక్కసారిగా  తల్లిపాలకు దూరం చేయవద్దు..

ఎప్పుడైనా సరే పిల్లలకు ఆకలి వేసినప్పుడు వెంటనే తల్లిపాల వద్దకు వస్తారు. కాగా పిల్లలకు ఆకలి వేసే ముందే ఏదో ఒకటి తినిపించండి. సంవత్సరం అయ్యాక వండిన అన్నం, క్యారెట్స్, పప్పు వంటివి పెట్టండి. ఇంట్లోనే చేసిన జ్యూసులు తాగించండి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ సడన్‌గా తల్లిపాలకు మాత్రం దూరం చేయవద్దు. పిల్లల్లో ఆందోళనను పెంచుతుంది. కాగా మెల్లిమెల్లిగా దూరంగా పెట్టాలి. పాలు మాన్పిస్తున్న టైంలో పిల్లలతో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయ్యండి.

వీటిని రొమ్ములకు అప్లై చేయండి..

అలాగే పెప్పర్ మింట్ ఆయిల్ ను చెస్ట్ వద్ద రాయండి. దీంతో పాల ఉత్పత్తిని తగ్గించుకోవచ్చు. పిప్పరమెంటు స్మెల్ ను పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. క్యాబేజీ ఆకుల్ని కూడా రొమ్ములపై పెట్టండి. ఇలా చేస్తే కూడా పాల ఉత్పత్తి తగ్గుతుంది. దీనినే కోల్డ్ థెరఫీ అంటారు. అలాగే అల్లం, వెల్లుల్లి రసం వంటివి చనుమొనలకు అప్లై చేస్తే మీ పిల్లలు పాలు మానుకుంటారని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News