Chicken Liver: చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

చాలామందికి నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే కొంత మందికి అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు.

Update: 2024-10-06 07:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: చాలామందికి నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే కొంత మందికి అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, ప్రాన్స్ అని రకరకాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఎక్కువగా ఇష్టపడేది చికెన్‌ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. సామాన్యులు సైతం కొనుక్కొని తినే ధర అందుబాటులో ఉంటుంది. అయితే చాలామంది చికెన్‌తో పాటు చికెన్ లివర్‌ను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మరి ఆ లాభాలేంటో ఇప్పుడు మనం చూద్దాం..

* చికెన్ లివర్‌లో సెలీనియం ఉంటుంది. అది గుండె జబ్బుల నుంచి రక్షణనిచ్చి.. హార్ట్ సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ రోజుల్లో గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయన్న సంగతి తెలిసిందే. అలాంటి వాటి నుండి బయట పడాలంటే చికెన్ లివర్‌ని తీసుకోవడం మంచిది.

* అలాగే లివర్‌లో ఉండే ఫోలేట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి.

* చికెన్ లివర్‌ని తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* అలాగే వీటిలో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బ్రెయిన్ పని తీరును కూడా మెరుగు పరుస్తుంది.

* చికెన్ లివర్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

* అదేవిధంగా ఎవరైన పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళు ఉంటే చికెన్ లివర్‌ని తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.

* ఇలా చికెన్ లివర్‌ని తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తి పొంది ఆరోగ్యంగా హ్యాపీగా ఉండవచ్చు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News