దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో రొమ్ము కాన్సర్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతూ మహిళల ప్రాణం తీస్తోంది. కొంతమంది జనాలకు అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కాగా.. చెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ముందుగానే గుర్తించి ఈ కూరగాయలను తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు.
* ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను నయం చేసే బ్రోకలీ బెస్ట్ క్యాన్సర్ నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
* మీర తినే ఆహారంలో బ్రోకలీ అధికంగా చేర్చడం మొత్తం హెల్త్ మెరుగుపడుతుంది.
* కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే స్త్రీలలో చెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.
* విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండే టమాటా ఈ క్యాన్సర్‌తో పోరాడటానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో లైకోపీన్ ఉంటుంది.
* అలాగే టమాటా గుండె జబ్బులను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
* క్యాలీ ఫ్లవర్ రుచికరంగా ఉండడమే కాక మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను సరఫరా చేయడానికి, రొమ్ము క్యాన్సర్‌తో పోరాడటానికి మేలు చేస్తుంది.
* కాబట్టి క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ కూరగాయలను అధికంగా తీసుకొండి. చెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టండి.