Diabetic Health : బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారా..? ఈ ఒక్క జ్యూస్‌తో ప్రాబ్లం క్లియర్!

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డయాబెటిస్‌ బాధితులు పెరిగిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో ప్రతికూల మార్పులు, మానసిక ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి.

Update: 2024-09-01 12:49 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డయాబెటిస్‌ బాధితులు పెరిగిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో ప్రతికూల మార్పులు, మానసిక ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. దీంతో రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగిపోయి మధుమేహం బారిన పడుతున్నారు. క్రమంగా ఈ పరిస్థితి డయాబెటిస్ పేషెంట్లలో క్రమంగా ఊబకాయం, మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బులు వంటివి సమస్యలకు దారితీయవచ్చునని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పానీయాలు డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయి. అలాంటి వాటిలో కాకరకాయ జ్యూస్ కూడా ఉందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. షుగర్ పేషెంట్లకు ఇది ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ లెవల్‌ నియంత్రణ

కాకరకాయలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని పాలీపెప్టైడ్-పి లేదా పి- ఇన్సులిన్ అనే సమ్మేళనం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి కాకర కాయను ఆహారంలో భాగంగా తినడం, ముఖ్యంగా దానిని జ్యూస్ తయారు చేసుకొని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీ 

శరీరంలో గ్లూకోజ్ శోషణను నియంత్రించడంలో కాకర కాయ జ్యూస్ సహాయపడుతుంది. దీనిని తాగడంవల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అందిస్తాయి. దీంతో షుగర్ బాధితుల్లో నెఫ్రోపతి, న్యూర్పతి, రెటినోపతి వంటి తీవ్రమైన పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

అధిక బరువుకు చెక్

డైటరీ ఫైబర్ కారణంగా కాకరకాయ జ్యూస్ అధిక బరువు సమస్యను కూడా నివారిస్తుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లకు ఇది చాలా ముఖ్యం అని చెప్తారు. పైగా ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. తద్వారా ఒబేసిటీని నివారంచడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పర్చడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Similar News