Carrot Bobbatlu: ప్రతి అవయవానికి మేలు చేసే క్యారెట్ బొబ్బట్ల తయారీ విధానం!!

కారెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Update: 2024-09-28 10:52 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: కారెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. చాలా మంది క్యారెట్ జ్యూస్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇంట్లోనే పిల్లలకు జ్యూస్ రెడీ చేసి ఇస్తారు. ఈ రసము తాగడం వల్ల ఫేస్ పై మచ్చలు తగ్గడంలో మేలు చేస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. క్యారెట్ రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ కు చెక్ పెడుతుంది. క్యారెట్ లో ఎన్నో రకాల పోషకాలు, అనామ్లజనకాలు, విటమిన్ సి కలిగి ఉన్నాయి.

అంతేకాకుండా క్యారెట్ ఇమ్మూనిటీ పవర్ ను పెంచడంలో తోడ్పడుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలున్న క్యారెట్ తో బొబ్బట్లు చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. అలాగే హెల్త్ కు కూడా ఎంతో మంచిది. క్యారెట్ బొబ్బట్ల తయారీ విధానం ఓసారి చూద్దాం..

క్యారెట్ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు..

మూడు స్పూన్ల కొబ్బరి పొడి, ఒకటిన్నర కప్పు గోధుమ పిండి, క్యారెట్ల తురుము - ఒక కప్పు, కొద్దిగా యాలకుల పొడి, సరిపడ నెయ్యి, అరకప్పు బెల్లం తురుము, సాల్ట్ చిటికెడు తీసుకోవాలి.

తయారీ విధానం..

ఒక బౌల్ తీసుకుని గోధుమపిండిలో కాస్త ఉప్పు వేసి వాటర్ వేసి ముద్దలా చేసుకోవాలి. కావాలంటే ఆయిల్ కూడా వేసి కలపొచ్చు. ఒక 30 నిమిషాల తర్వాత గ్యాస్ పై కడాయిలో నెయ్యి వేయండి. తర్వాత క్యారెట్ తురుము వేసి వేయించాక తురిమిన బెల్లాన్ని వేయండి. ఈ క్రమంలోనే కొబ్బరి పొడి, యాలకుల పొడిని యాడ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్నంతా పక్కన పెట్టండి.

ఇప్పుడు ఒక పెనం తీసుకుని గోధుమపిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పూరీలా చేయండి.తర్వాత వాటిని మధ్యలో క్యారెట్ల మిశ్రమాన్ని కప్పి పెట్టి ఒత్తండి. ఇక రెండు వైపులా నెయ్యి రాస్తూ కాలిస్తే క్యారెట్ బొబ్బట్లు తయారు అయిపోయినట్లే. రుచి బాగుండటంతో పాటు ఎన్నో రోగాలను దరి చేరనివ్వవు. శరీరంలోని ప్రతి అవయవానికి మేలు చేస్తాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News