Capsicum Benefits : క్యాప్సికంలోని ఆ పోషకాలు.. ఎలాంటి బెనిఫిట్స్ కలిగిస్తాయంటే..

మనం ఆహారంలో భాగంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. కొందరి దీనిని తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. కానీ తినడంవల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-08-24 11:15 GMT

దిశ, ఫీచర్స్ : మనం ఆహారంలో భాగంగా తీసుకునే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. కొందరి దీనిని తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. కానీ తినడంవల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ సి కూడా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నివారణంలో సహాయపడుతుంది. ఇంకా ఏయే ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

* క్యాప్సికంలో దాదాపు అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అలాగే తరచుగా తినడంవల్ల ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని, రక్త హీనతను తగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం మూలంగా అధిక బరువును, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పర్చడంలో సహాయపడుతుంది.

* బీటా కెరోటిన్ ఉండటంవల్ల క్యాప్సికం కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. దృష్టి లోపాలు, ముఖ్యంగా రేచీకటి వంటివి రాకుండా ఉంటాయి. అలాగే లుటిన్, జియాక్సింతిన్ పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. విటమిన్ సి కూడా ఉండటంవల్ల చర్మ ఆరోగ్యానికి మంచిది.

* ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లకు మూలం కాబట్టి క్యాప్సికం హైకొలెస్ట్రాల్ నివారణలో మంచి ఆహారంగా చెప్పవచ్చు. గుండె జబ్బులు, చర్మ రోగాలను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖంపై వృద్ధాప్య ఛాయలను పోగొట్టి, యవ్వనంగా కనిపించేలా సహాయపడే పోషకాలు క్యాప్సికంలో ఉంటాయి.

* క్యాప్సైసిన్ అనే పోషకం వల్ల చర్మ వ్యాధుల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిండంలో క్యాప్సికం అద్భుతమైన ఆహారం. అట్లనే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి వివిధ అంటు వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కీళ్లు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు క్యాప్సికంలో ఉన్నాయి. కాబట్టి ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News