ఎక్కడైనా ఇల్లు అద్దెకు ఇస్తారు.. కానీ అక్కడ ఊరంతా అద్దెకు, రోజుకు ఎంత అంటే?
మనం ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ఉంటడానికి ఇళ్లు అద్దె తీసుకుంటాం. లేదా ఏదైనా పని మీద వెళ్తే రెండు, మూడు రోజుల కోసం రూమ్ తీసుకోవడం మాములే. కానీ
దిశ, వెబ్‌డెస్క్ : మనం ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ఉంటడానికి ఇళ్లు అద్దె తీసుకుంటాం. లేదా ఏదైనా పని మీద వెళ్తే రెండు, మూడు రోజుల కోసం రూమ్ తీసుకోవడం మాములే. కానీ ఎక్కడైనా ఊరు అద్దెకు తీసుకోవడం చూశారా? కానీ అక్కడ మాత్రం ఏకంగా ఊరునే అద్దెకు తీసుకోవచ్చంట. ఊరును అద్దెకు తీసుకోవడం ఏంటీ అని షాక్ అవుతున్నారా..అయితే మీరే చూడండి.
ఇటలీ నడిబొడ్డున ఉండే లే మార్షె ప్రాంతంలో ఉన్న మధ్యయుగాల నాటి ఊరి పేరు పెట్రిటోలి. రోమన్ నాగరికత కాలం నాటి పూరాతన కట్టడాలు, వాటిలోని నేలమాళిగలు,బోటిక్ లాడ్జింగ్‌లు వాటితోపాటే మప్పయ్యేడు పడక గదులు భారీ రాచప్రాసాదం, ఒక రంగస్థల వేదిక , సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల ఎత్తులో ఉండే ఈ ఊరు చల్లని వాతావరణంతో అందంగా ఉంటుంది.
అయితే ఈ ఊరిని అద్దెకు తీసుకోవచ్చు. కానీ రోజు 133 పౌండ్లు (రూ.1,28,577) చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీన్నిచాలా మంది అద్దెకు తీసుకుంటుంటారంట. పెళ్లీలు, పుట్టిన రోజు లాంటి సమావేకశాలకు ఈ ఊరును అద్దెకు తీసుకొని సంతోషంగా గడుపుతారంట.
Also Read..
Life : పక్క వాళ్ల గురించి మీ జీవితాన్ని పాడు చేసుకోకండి? -197583