స్టెమ్ సెల్ టెక్నాలజీ.. దీంతో టైప్ 1 డయాబెటిస్‌ను నయం చేయవచ్చా..

మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బందుల పాలు చేస్తున్నఅనారోగ్య సమస్య.

Update: 2024-10-01 11:30 GMT

దిశ, వె‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : మధుమేహం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బందుల పాలు చేస్తున్నఅనారోగ్య సమస్య. ఈ మధ్య కాలంలో పెద్దవారు మాత్రమే కాకుండా యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోల్చుకుంటే భారతదేశంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్నాయి. రాబోయే 20 సంవత్సరాలలో, ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ వ్యాధిని నిర్మూలించేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.

గ్లూకోజ్‌ని నియంత్రించడానికి శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది అనేక కారణాల వల్ల జరగవచ్చు. అలాంటప్పుడే శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగి మధుమేహం వస్తుంది. ఇలా పెరిగిన గ్లూకోజ్ శరీరంలోని అన్ని అవయవాల పై ప్రభావం చూపుతుంది. క్రమంగా అన్ని అవయవాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి.

మధుమేహం ఎందుకు వస్తుంది ?

మధుమేహం రెండు రకాలు, ఒకటి టైప్-1, మరొకటి టైప్-2. సరైన జీవనశైలి లేని కారణంగా కాలక్రమేణా వచ్చే టైప్-2 మధుమేహం, చిన్నప్పటి నుంచి వచ్చే టైప్-1 మధుమేహం వస్తుంటాయి. ఈ రెండు రకాల మధుమేహం కూడా ప్రమాదకరమే అయినప్పటికీ, టైప్ 1 బాల్యంలో సంభవిస్తుంది కాబట్టి పిల్లల పై అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకు, ఈ రెండు రకాల మధుమేహానికి శాశ్వత చికిత్స అనేది అస్సలు సాధ్యపడలేదు. ఇన్సులిన్‌ను బయట నుంచి ఇవ్వడం ద్వారా గ్లూకోజ్ నియంత్రించవచ్చు. అయితే ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు టైప్-1 డయాబెటిస్ చికిత్సకు స్టెమ్ సెల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఏమిటి..

నిజానికి, మూలకణాలు దెబ్బతిన్న కణాలను సరిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ కణాలకు ఎలాంటి డ్యామేజ్ అయినా సరిచేసే అపారమైన శక్తి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ టెక్నాలజీతో టైప్-1 మధుమేహానికి మందు కనిపెట్టారు. తాజా పరిశోధన ప్రకారం శాస్త్రవేత్తలు కూడా ఈ సాంకేతికత ద్వారా ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకు నయం చేస్తారని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే మొదటి కేసుగా పేర్కొంటున్నారు.

చైనీస్ న్యూస్ అవుట్‌లెట్ ప్రకారం గత 20 సంవత్సరాలుగా టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 25 ఏళ్ల మహిళ ది పేపర్, కొత్త ఇన్వాసివ్‌తో సుమారు రెండున్నర నెలల తర్వాత తన షుగర్ స్థాయిలను నియంత్రించగలిగింది. శస్త్రచికిత్స తరువాత ఈ టైప్-1 మధుమేహం రోగిని పూర్తిగా నయం చేయడంలో స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ సహాయపడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టెక్నిక్‌లో రోగి శరీరం నుండి కణాలు తీసుకుంటారు. వాటిని ల్యాబ్‌కు తీసుకెళ్లి అనేక మార్పులు చేస్తారు. ఈ కణాలను తిరిగి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇన్సులిన్ పనితీరు టైప్-1 మధుమేహాన్ని నయం చేయడంలో ఓ మార్గం కనిపించింది.

ఈ సాంకేతికత పైనే శాస్త్రవేత్తల ఆశలు..

ఈ సర్జరీకి డాక్టర్లు అరగంట మాత్రమే సమయం తీసుకుంటారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఈ శస్త్రచికిత్స అనంతరం శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతతో చాలా సంతృప్తి చెందారు. విష్యత్తులో ఈ సాంకేతికత ద్వారా టైప్ 1 డయాబెటిస్ చికిత్స పై ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు. ఇది నిజంగా జరిగితే డయాబెటిస్‌కు వ్యతిరేకంగా ఇది పెద్ద విజయం అవుతుందంటున్నారు. ఇది టైప్-2 డయాబెటిస్‌కు నివారణను కనుగొనడంలో కూడా చాలా సహాయపడుతుందని చెబుతున్నారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News