ట్యాబ్లట్స్ వేసుకునే ముందు టీ, కాఫీ తాగవచ్చా?.. ఏం జరుగుతుంది?

మీరు గమనించే ఉంటారు. చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఉదయం వేళ మందులు వేసుకునే వారు అయితే ఇది కచ్చితంగా పాటిస్తుంటారు.

Update: 2024-05-31 13:45 GMT

దిశ, ఫీచర్స్ : మీరు గమనించే ఉంటారు. చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఉదయం వేళ మందులు వేసుకునే వారు అయితే ఇది కచ్చితంగా పాటిస్తుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మరింత ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీ, కాఫీలతోపాటు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వేసుకోవడంవల్ల వాటి ప్రభావం తగ్గుతుందట. అయితే ఏయే ట్యాబ్లెట్స్ టీ, కాఫీలతో కలిపి వేసుకోవద్దో తెలుసుకుందాం.

*ముఖ్యంగా థైరాయిడ్ సమస్య తగ్గడానికి మందులు వేసుకునేవారు ఆ సమయంలో టీ లేదా కాఫీ తాగవద్దు. ఎందుకంటే కెఫిన్ థైరాయిడ్ అమసతుల్యతను ప్రేరేపిస్తుంది. అలాగే జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీ అలెర్జెటిక్ మెడిసిన్ వాడుతుంటారు. ఈ మందులు ‘సూడో పెడ్రిన్’ కలిగి ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థకు ఉద్దీపనగా పనిచేస్తాయి. అలాగే టీ, కాఫీలు కూడా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మందులతో కలిపి వేసుకోవడం మంచిది కాదు.

* డయాబెటిస్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ వేసుకునేవారు కూడా వీటిని టీ, కాఫీతో కలిపి వేసుకుంటే హానికరం. అలాగే కాఫీ, టీలలో పాలు, చక్కెర కలిపితే గనుక మరింత ప్రమాదం. ఎందుకంటే ఇవి డయాబెటిస్ పేషెంట్లలో రక్తంలో షుగర్ లెవల్స్‌ను పెంచుతాయి. నిపుణుల ప్రకారం.. కెఫిన్ మధుమేహం లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే డెడ్‌పెగిల్, రివాస్టిగ్మైన్, గెలాంటమైన్ వంటి అల్జీమర్స్ మందులు కూడా టీ, కాఫీలతో కలిసి తీసుకుంటే సమస్య మరింత పెరిగే చాన్స్ ఉంటుంది. 


Similar News