Cancer : అధిక ఎత్తు క్యాన్సర్‌కు కారణం కాగలదా ? పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూడండి..

భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-09-10 02:06 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్: భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2023 సంవత్సరంలో భారతదేశంలో 14 లక్షలకు పైగా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయి. రానున్న కాలంలో ఈ కేసులు వేగంగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. చెడు ఆహారపు అలవాట్లు, బలహీనమైన జీవనశైలి క్యాన్సర్‌కు అతిపెద్ద ప్రమాద కారకాలు అని సాధారణంగా చెబుతారు. కానీ ఇప్పుడు క్యాన్సర్‌కు సంబంధించి ఒక కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఈ పరిశోధనలో క్యాన్సర్ కు వ్యక్తి ఎత్తుకు మధ్య సంబంధం ఉందని కనుగొన్నారని చెబుతున్నారు పరిశోధకులు.

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ప్రకారం ఎత్తుకు క్యాన్సర్ కు మధ్య లోతైన సంబంధం ఉందంటున్నారు. ఒక వ్యక్తి సాధారణం కంటే అధికంగా ఎత్తు ఉండడం వలన వారిలో పెద్దప్రేగు, గర్భాశయం (ఎండోమెట్రియం), అండాశయం, కిడ్నీ, రొమ్ము క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కవుగా ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం పరిశోధకులు 15 మందిని పరీక్షించి పొడవుగా ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు.

అధిక ఎత్తుతో క్యాన్సర్ ముప్పు 16 శాతం పెరుగుతుంది..

మనిషి సాధారణం కన్నా అధికంగా ఎత్తు పెరగడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని 16% పెంచుతుందని పరిశోధనలో తేలిందంటున్నారు నిపునులు. సాధారణ ఎత్తు (సుమారు 165 సెం.మీ.) ఉన్న ప్రతి 10,000 మంది మహిళల్లో దాదాపు 45 మందికి క్యాన్సర్ ఉంది. అదే మహిళలు 175 సెం.మీ. ఉన్నవారిలో వారిలో ప్రతి 10,000 మంది మహిళల్లో 52 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని చెబుతున్నారు. అంటే అధిక ఎత్తు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

23 క్యాన్సర్లలో 22 క్యాన్సర్లు సాధారణంగా పొట్టి వారిలో కంటే పొడవాటి వ్యక్తులలో ఎక్కువగా వస్తాయని పరిశోధనలో తేలింది. క్యాన్సర్, ఎత్తు మధ్య సంబంధం ఉందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయంటున్నారు పరిశోధకులు. అయితే చాలా సందర్భాల్లో క్యాన్సర్ జన్యువుల కారణంగా కూడా వస్తుందని చెబుతున్నారు. ఉదాహరణకు ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ ఉంటే, ఈ క్యాన్సర్ ఆమె కుమార్తెకు కూడా వ్యాపిస్తుంది. అప్పుడు ఎత్తుతో అవసరమే లేదంటున్నారు నిపుణులు.

ఎత్తు, క్యాన్సర్ మధ్య సంబంధం ?

వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ప్రకారం, పొడవాటి వ్యక్తికి ఎక్కువ కణాలు ఉంటాయని చెబుతున్నారు. ఎక్కువ కణాల కారణంగా కణాలలో మ్యుటేషన్, వాటి విభజన ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కణాలు అదుపు లేకుండా పెరగడం ప్రారంభిస్తే అది క్యాన్సర్‌గా మారుతుందంటున్నారు. ఎత్తుగా ఉండే వ్యక్తి శరీరంలో ఎక్కువ కణాలను కలిగి ఉన్నందున, ఎక్కువ కణ విభజన జరుగుతుందంటున్నారు. అలాంటి వారిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు.

పురుషులలో ఎక్కువ ప్రమాదం..

స్త్రీల కంటే పురుషుల ఎత్తు ఎక్కువగా ఉంటుంది. అందుకే సుమారుగా క్యాన్సర్ ప్రమాదం మహిళల్లో కంటే పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని, ఎత్తు, క్యాన్సర్ ప్రమాదానికి సంబంధించి మరింత డేటా సేకరిస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News