చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలతో ఫింగర్ ప్రింట్ లాకింగ్ తీయవచ్చా..? నిపుణులు చెబుతుంది ఇదే!

ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి ఒక్క మొబైల్ కూడా సెన్సార్ సిస్టంతోనే వస్తున్నాయి. ప్రతి ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ లాక్స్ వస్తున్నాయి.

Update: 2023-04-01 16:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి ఒక్క మొబైల్ కూడా సెన్సార్ సిస్టంతోనే వస్తున్నాయి. ప్రతి ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ లాక్స్ వస్తున్నాయి. అయితే ఈ లాక్‌ను చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో తీయవచ్చా అంటే ముమ్మాటికీ తీయరాదని అంటున్నారు నిపుణులు. ఒక మనిషి చనిపోయిన తరువాత వారి డెడ్ బాడీలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే వారి వేలిముద్రలు కూడా మారిపోతాయి. అప్పుడు వారి ఫోన్ అన్ లాక్ అయ్యే అవకాశమే ఉండదు. ఇక చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో ఫోన్ ఎందుకు అన్లాక్ అవ్వదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓ మనిషి మృతి చెందిన తరువాత మనిషి శరీరంలో ఉండే కణాలు పూర్తిస్థాయిగా పనిచేయడం మానేస్తాయి. శరీరంలో ఉండే ఎలక్ట్రికల్ కండక్టెన్స్ కూడా చనిపోతాయి. దాంతో డెడ్ బాడీలోనే కాదు వేలిముద్రల్లో కూడా మార్పులు వస్తాయి. చనిపోయని వ్యక్తి వేలిముద్రల్ని కేవలం ఫోరెన్సిక్ నిపుణులు మాత్రమే సిలికాన్ పుట్టీని ఉపయోగించి ల్యాబ్‌లో గుర్తిస్తారు. సిలికాన్ పుట్టీ పై ఎంతటి సూక్ష్మంగా ఉన్న వేలిముద్రలు అయినా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఈ వేలిముద్రలతో మరణించిన వ్యక్తికి చెందిన మొబైల్‌ని మాత్రం అన్‌లాక్ చేయలేము. మొబైల్ ఫోన్‌ల సెన్సార్లు మనిషి శరీరంలోని విద్యుత్ వాహకత ఆధారంగా పనిచేస్తాయి. మరణం శరీరంలో ఎలక్ట్రికల్ కండక్టెన్స్ నిలిచిపోయినప్పుడు మొబైల్ ఫోన్‌ల సెన్సార్లు వేలిముద్రలను గుర్తించలేవు. కాబట్టి సినిమాల్లో చూపించిన విధంగా చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలను ఉపయోగించి ఏ ఫింగర్ ప్రింట్ లాకింగ్స్‌ను తెరవడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు.. మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్

Tags:    

Similar News