డయాబెటిక్ పేషెంట్లు కాఫీ తాగొచ్చా?.. నిపుణులు చెప్తున్నది ఇదే!

పొద్దున్న లేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనివల్ల మంచి అనుభూతి కలుగుతుందని, ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుందని కొందరు చెప్తుంటారు. యాక్టివ్‌నెస్ పెంచుతుందని మరికొందరు భావిస్తుంటారు.

Update: 2024-07-08 13:40 GMT

దిశ, ఫీచర్స్ : పొద్దున్న లేవగానే కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీనివల్ల మంచి అనుభూతి కలుగుతుందని, ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుందని కొందరు చెప్తుంటారు. యాక్టివ్‌నెస్ పెంచుతుందని మరికొందరు భావిస్తుంటారు. అయితే డయాబెసిస్ ఉన్నవారు కాఫీ తాగొచ్చా.. లేదా?. షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గుల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే సందేహాలు, అనుమానాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

* నిజానికి కాఫీలో కెఫిన్, పాలీఫెనాల్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆయా వ్యక్తుల శరీరాన్ని భిన్నంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పాలీ ఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది కాబట్టి శరీరంలో ఆక్సీకరణ, ఒత్తిడి, మూడ్ స్వింగ్ వంటి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటంవల్ల షుగర్ పేషెంట్లకు కూడా మేలు జరుగుతుంది. అయితే ఫ్రీ రాడికల్స్ టైప్ -2 డయాబెటిస్‌కు కూడా కారణం అవుతుంటాయని, కాఫీలోని సమ్మేళనాలు వీటితో పోరాడుతాయి కాబట్టి షుగర్ పేషెంట్లు దానిని తాగడంవల్ల రిస్క్ ఉండదని నిపుణులు చెప్తున్నారు.

* కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రెస్‌ను నివారిస్తాయి. అలాగే డయాబెటిస్ బాధితుల్లో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు తలెత్తకుండా పోరాడుతాయి. మెగ్నీషియం, క్రోమియం వంటి ఖనిజాలు ఉండటంవల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. కాబట్టి కాఫీ ఓ మోతాదు వరకు తాగడం మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాకపోతే మరీ ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. టైప్ - 2 డయాబెటిక్ పేషెంట్లు డైలీ 2 నుంచి 4 కప్పుల వరకు కాఫీ తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. అంతకు మించితే మాత్రం ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాల నివృత్తి, సలహాల కోసం నిపుణులను సంప్రదించగలరు. 


Similar News