బాయ్ సోబర్.. రిలేషన్‌షిప్‌లో ఏమిటీ కొత్త ట్రెండ్?

‘బాయ్ సోబర్’.. ఈ పదం గురించి గతంలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Update: 2024-07-06 12:28 GMT

దిశ, ఫీచర్స్ : ‘బాయ్ సోబర్’.. ఈ పదం గురించి గతంలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాబట్టి పలువురు దాని గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. నిపుణుల ప్రకారం వాస్తవానికి ఇదొక రిలేషన్‌షిప్ ట్రెండ్‌గా పాపులర్ అయింది.

లవ్, ఫ్రెండ్‌షిప్, డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్.. ఇలా సబంధం ఏదైనా కొన్నాళ్లకు మనస్పర్థలు రావచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి అవతలి వ్యక్తివల్ల ఇబ్బందిగా ఫీలవుతుండవచ్చు. లవ్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, నిర్లక్ష్యానికి గురికావడం, తనను అర్థం చేసుకోకపోవడం వంటి కారణాలతో అవతలి వ్యక్తితో కలిసి ఉండలేని పరిస్థితులు కొందరికి ఏర్పడుతుంటాయి. ఈ సందర్భంగా వీరు మానసిక ఆందోళనకు గురవుతారు.

అయితే ఇలాంటప్పుడు బాధితులు తమది టాక్సిక్ రిలేషన్‌షిప్ అనే భావనకు వస్తారు. దీంతో తమ పార్ట్‌నర్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ వెనుకాడుతుంటారు. తర్వాత ఏం జరుగుతుందోనని భయపడుతుంటారు. చూడ్డానికి కలిసి ఉంటారు తప్ప మానసికంగా మాత్రం తటస్థంగా ఉంటారు. సరిగ్గా ఇలాంటి వ్యక్తినే ‘బాయ్ సోబర్‌’గా పేర్కొంటారు. ఒకప్పుడు కేవలం మహిళలు మాత్రమే ‘బాయ్ సోబర్‌’గా ఉండేవారని అనుకునేవారు. కానీ ఇప్పుడు జెండర్‌తో సంబంధం లేకుండా అందరూ బాధితులు అవుతున్నారు. టాక్సిక్ రిలేషన్ షిప్‌నుంచి కొంత విరామం తీసుకోవాలని భావిస్తున్నారు. గత సంబంధాలు లేదా ప్రస్తుత సంబంధంలో ఏర్పడిన మనస్పర్థలు, మానసిక గాయాలు, ఆందోళన నుంచి కోలుకోవడానికి తీసుకునే విరామ సమయమే బాయ్ సోబర్ ట్రెండ్‌. ఇక్కడ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ప్రయారటీ అంశాలుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.


Similar News