Hair Spa: జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలా? ఇంట్లోనే 4 విధాలుగా హెయిర్ స్పా చేసుకోండి!!

ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ పెద్ద సమస్యగా మారిపోయింది.

Update: 2024-10-05 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ పెద్ద సమస్యగా మారిపోయింది. ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరు జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు కారణం జీవన శైలిలో మార్పులే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. కాగా హెయిర్ ఫాల్‌కు ప్రాబ్లమ్ కు చెక్ పెట్టాలంటే హెయిర్ స్పా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే హెయిర్ స్పా వల్ల జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు సమస్యలు దూరం అవుతాయి.

రూపాయి ఖర్చు లేకుండా.. 

అలాగే హెయిర్ మీకు నచ్చినట్లుగా తయారై.. దగదగ మెరిసిపోతుంది. కాగా పదిహేను రోజులకొకసారి హెయిర్ స్పా ట్రీట్మెంట్ తీసుకోండి. అయితే హెయిర్ స్పా కోసం పార్లర్ కు వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందిగా అని ఆలోచిస్తున్నారా? అలాంటి సందేహాలు ఏం పెట్టుకోకుండా ఏం చక్కా మనీ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా హెయిర్ స్పా చేసుకోండి. ఎలాగో ఇప్పుడు చూద్దాం..

హెయిర్ స్పాకు ముందు ఏం చేయాలి?

ఎప్పుడైనా సరే హెయిర్ స్పా కు ముందు కొబ్బరి ఆయిల్ ను పెట్టుకోవాలి. లేకపోతే ఆలివ్ ఆయిల్ పెట్టుకున్నా పర్వాలేదు. ఈ ఆయిల్ ను కాస్త వేడి చేసి హెయిర్ కు అప్లై చేయాలి. పదిహేను నిమిషాల అనంతరం మరింత ఆయిల్ వేసి ముప్పై నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత జుట్టుకు ఆవిరి పట్టించండి. అనంతరం వేడి వాటర్ తో టవల్ ను ముంచి వెంట్రుకలను కట్టుకోండి. దీంతో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆవిరి మాత్రం 10 నిమిషాల కన్నా ఎక్కువగా పట్టకూడదు. ఆవిరి పట్టాక షాంపుతో హెయిర్ క్లీన్ చేసుకోండి. వేడి వాటర్ తో తలకు పోసుకోవద్దు. అలా చేస్తే హెయిర్ పోషణ తగ్గే అవకాశాలు ఉంటాయి.

జుట్టు చివర్లో చిట్లిపోయిందా..?

అలాగే హెయిర్ చివర్లో చిట్లిపోయినట్లు ఉంటే.. దానికి చెక్ పెట్టడానికి హెయిర్ మాస్క్ అప్లై చేయండి. హెయిర్ మాస్క్ మార్కెట్ లో  కూడా దొరుకుతుంది. లేకపోతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జుట్టుకు హెయిర్ మాస్క్ అప్లై చేశాక షాంపుతో శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో హెయిర్ హెల్తీగా ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News