Curd rice: రెస్టారెంట్‌ స్టైల్‌లో కర్డ్ రైస్ రెసిపీ.. సేమ్ రుచి రావాలంటే?

కర్డ్ రైస్ అంటే ఇష్టపడని వారు ఉండరు.

Update: 2024-10-05 14:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్డ్ రైస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇంట్లో పెరుగు అన్నం అంటే ఇష్టడని వారు కూడా రెస్టారెంట్ లోని కర్డ్ రైస్ చూస్తే నోట్లో ఊరిళ్లు పుడతాయి. కాగా అదే స్టైల్ లో కర్డ్ రైస్ తయారీ విధానం చూద్దాం..

కర్డ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..

నాలుగు కప్పుల అన్నం, పచ్చిమిర్చి-3, రెండు కప్పుల పెరుగు, 2 చెంచాల నూనె చిక్కటి మీగడ పాలు సగం కప్పు తీసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, ఆయిల్- 2 స్పూన్స్, చిన్న అల్లం ముక్క, సరిపడ ఉప్పు, ఆవాలు, మినపప్పు, శెనిగపప్పు, జీలకర్ర-అరటీస్పూన్, కొన్ని జీడిపప్పు, ఎండుద్రాక్ష ముక్కలు, ఇంగువ చిటికెడు, దానిమ్మ గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి-2 తీసుకోవాలి.

కర్డ్ రైస్ తయారీ విధానం..

అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాయాలయ్యాక వేడి వేడి అన్నంలో మీగడ పాలు అండ్ పెరుగు వేసి కలపాలి. తర్వాత అల్లం ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి.. తాలింపు వేయాలి. ఇందుకోసం కడాయి తీసుకుని ఆయిల్ వేసి.. వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుద్రాక్ష, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. ఐదు నిమిషాలయ్యాక పక్కన పెట్టుకున్న పెరుగన్నంలో ఈ తాలింపు వేసి కలపండి. లాస్ట్ లో దానిమ్మ గింజలు వేస్తే నోట్లో నీళ్లూరే కర్డ్ రైస్ తయారైపోయినట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News