Botox Treatment: బొటాక్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి..? లాభాలు-నష్టాలు
చాలా మంది ఆడవాళ్లు నలుగురిలో అందంగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఆడవాళ్లు నలుగురిలో అందంగా, యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం ఇంట్లోనే పలు రకాల చిట్కాలు ఫాలో అవుతారు. మరికొంతమంది బ్యూటీ చికిత్సలో భాగంగా పలు రకాల ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇందులో బొటాక్స్ ఒకటి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది. మరీ బొటాక్స్ అంటే ఏమిటి? స్కిన్ యవ్వనంగా ఏ విధంగా మారుస్తుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బొటాక్స్ అంటే ఏంటి?
బొటాక్స్ క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బాక్టీరియం ద్వారా ఉత్పత్తి చేయబడిన న్యూరోటాక్సిక్ ప్రోటీన్. ఇది చర్మంపై ముడుతలను తగ్గించడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధ ఇంజెక్షన్. దీన్నే బ్యూటీ ట్రీట్మెంట్ అంటారు.
బొటాక్స్ ఫేస్‌పై ఉపయోగించే విధానం..
డాక్టర్లు ఫస్ట్ ఫేస్‌పై నంబింగ్ క్రీమ్ అప్లై చేస్తారు. తర్వాత ముఖంపై బొటాక్స్ చేయడానికి నర్ధేశించిన సూదిని యూజ్ చేసి.. స్కిన్‌పై ఇంజెక్షన్ ఇస్తారు. 20 లేదా 30 నిమిషాలు ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇండియాలో బొటాక్స్ ట్రీట్మెంట్‌కు రూ . 15 వేల నుంచి రూ. 36 వేల వరకు ఉంటుందట. ఒక్కో దేశంలో ఒక్కో ప్రైజ్ ఉంటుందట.
బొటాక్స్ ప్రయోజనాలు..
ఈ చికిత్స తీసుకోవడం వల్ల స్కిన్ యవ్వనంగా మారిపోతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. నుదుటిపై, కళ్లపైన ముడతల్ని తగ్గిస్తుంది. మెడ నొప్పులు, చెమటలు పట్టడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కళ్లకింద నల్లని వలయాలు తగ్గిస్తుంది. ముఖ్యంగా కళ్లకింద నల్లటి వలయాలకు చెక్ పెట్టడానికే ఎక్కువమంది బొటాక్స్ చికిత్స చేయించుకుంటారు.
బొటాక్స్ నష్టాలు..
బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కండరాలు బలహీనపడతాయి. చెవినొప్పి అండ్ దవడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. బొటాక్స్ కాస్మెటిక్ ప్రక్రియలు కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం కలిగిస్తాయి. అంతేకాకుండా తలనొప్పి, ముఖ్యంగా మైగ్రేషన్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఈ చికిత్స చేయించుకుంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది. ఫేస్, లిప్స్, గొంతు ప్రదేశాల్లో అలెర్జీ, వాపు వస్తుంది. శ్వాస సమస్యలు కూడా తలెత్తే చాన్స్ ఉంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.