పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరంగా ఉందా?
నెలసరి సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.
దిశ,వెబ్ డెస్క్: నెలసరి సమయంలో మహిళలు అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఋతుస్రావం శరీరంలోని హార్మోన్లను మార్చడమే కాకుండా మానసిక స్థితిని కూడా మారుస్తుంది. ఇది నొప్పి రూపంలో శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పీరియడ్స్ సమయంలో కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు ఏవేమి పానీయాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్స్ లో విటమిన్స్, మినిరల్స్ పీరియడ్ క్రాంప్స్ ను తగ్గిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం కడుపు ఉబ్బరాన్ని, కడుపు నొప్పి సమస్యలని నివారిస్తుంది.
పెప్పర్‌మింట్ టీ
పెప్పర్‌మింట్ లో కార్మినేటివ్ ప్రభావాన్ని కలిగి ఉందని న చూపబడింది. అది జీర్ణవ్యవస్థ నుంచి గ్యాస్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో రోజులో కనీసం ఒక కప్పు అయినా పెప్పర్‌మింట్ టీ తాగాలి.
Read More : నెలసరి నొప్పులకు ఈ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి