Flightless birds : రెక్కలున్నా ఎగరలేవు.. ఈ పక్షుల ప్రత్యేకతలివే..
పక్షులు అనగానే చాలా మందికి పల్లెటూర్లు, చెరువులు, పచ్చటి పొలాలు, అటవీ ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే వాటి కిలకిల రావాలు, రెక్కలతో ఎగురుతూ స్వేచ్ఛగా విహరించడం అక్కడే ఎక్కువగా చూస్తుంటాం.
దిశ, ఫీచర్స్ : పక్షులు అనగానే చాలా మందికి పల్లెటూర్లు, చెరువులు, పచ్చటి పొలాలు, అటవీ ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే వాటి కిలకిల రావాలు, రెక్కలతో ఎగురుతూ స్వేచ్ఛగా విహరించడం అక్కడే ఎక్కువగా చూస్తుంటాం. సిటీల్లో కూడా అప్పుడప్పుడూ కొన్ని పక్షులు కనిపిస్తున్నప్పటివీ వాటి ప్రవర్తనను మనం పెద్దగా అబ్జర్వ్ చేయం. అయితే జీవవైవిధ్యంలో పక్షుల పాత్ర కూడా చాలా కీలకమని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అనేక రకాల పక్షులు ఉన్నప్పటికీ కొన్ని చాలా ప్రత్యేకమైనవి. మరికొన్ని రెక్కలు కలిగి ఉన్నప్పటికీ ఎగరలేవు. అలాంటి పక్షిజాతులేవో ఇప్పుడు చూద్దాం.
ఈ భూమిపై 6.6 కోట్ల సంవత్సరాల క్రితం రెక్కలతో కూడిన కొన్ని జీవులు ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అప్పట్లో డైనోసర్లకు (dinosaurs) కూడా రెక్కలుండేవని, అవి ఆకాశ మార్గంలో ఎగిరేవని చెప్తారు. కాగా పరిణామ క్రమంలో అవి రెక్కలను కోల్పోయాయి. ఇక ఇప్పుడైతే కేవలం పక్షులకు మాత్రమే రెక్కలు ఉంటున్నాయి. అయితే రెక్కలు ఉన్నప్పటికీ పరిణామ క్రమంలో ఎగరలేని శరీర నిర్మాణాన్ని సంతరించుకున్న వాటిలో 8 రకాల పక్షులు ఉన్నయాని నిపుణులు చెప్తున్నారు.
స్టీమర్ బాతులు
నీటిపై ఈదుతూ కనిపించే ‘అనటిడే’ కుటుంబానికి చెందిన ఒక రకమైన జాతి పక్షులనే స్టీమర్ బాతులు (Steamer బుక్స్) అంటారు. మిగతా పక్షులకంటే కాస్త బరువుగా ఉండే ఈ బాతులు ఎక్కువగా దక్షిణ అమెరికాలోని ఫాక్ ల్యాండ్ దీవుల్లో కనిపిస్తుంటాయి. వీటిలో నాలుగు రకాలు ఉంటాయని, గా మూడు రకాల బాతులు రెక్కలు ఉన్నప్పటికీ గాలిలో ఎగరలేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇవి కనిపిస్తుంటాయి. అయితే ఈ బాతులు ఇతర జాతి బాతులు లేదా పక్షులు తమ నివాసాల వద్దకు వస్తే సహించవట. వాటిని దూరంగా తరిమేందుకు ప్రయత్నిస్తాయి.
పెంగ్విన్లు
పెంగ్విన్ల (Penguins) గురించి అందరికీ తెలిసిందే. సముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. దక్షిణ ధృవంలోని సముద్రాల్లోనే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం సుమారు 17 నుంచి 20 పెంగ్విన్ జాతులు ఉన్నాయని అంచనా. ఇక వీటిలో అన్నింటికంటే పెద్ద జాతి పెంగ్విన్లను రారాజు పెంగ్విన్‌లు అంటారు. ఇవి సుమారు 1.1 మీటర్ల పొడవు, 35 కేజీల బరువును కలిగి ఉంటాయి. రెక్కలున్న పక్షులే అయినప్పటికీ ఎగరలేవు. కాకపోతే ఆ రెక్కలను నీటిపై ఈత కొట్టడానికి ఉపయోగించుకుంటాయి. శరీరం సన్నగా, స్మూత్‌గా ఉంటుంది. నీటిలోనే ఎక్కువ సమయం గడుపుతాయి. గుడ్లు పెట్టడానికి, పిల్లలను పెంచడానికి మాత్రమే సముద్ర తీరాలకు వస్తాయి.
వెకా పక్షి
వెకా పక్షులు (Veca bird) చూడటానికి కోళ్ల సైజులో కనిపించే గోదుమ రంగులో ఉండే పక్షులు. ఇవి ఎక్కువగా న్యూజిలాండ్‌లో కనిపిస్తుంటాయి. పండ్లను, పురుగులను తింటాయి. ఆగష్టు నుంచి జనవరి మధ్య కాలంలో గుడ్లను పొదుగుతాయి. ఈ పక్షుల్లో నాలుగు రకాలు ఉంటాయి. రెక్కలున్నప్పటికీ ఏవి కూడా ఎగరలేవు. వీటి ముక్కు షార్ప్‌గా, కాళ్లు బలంగా, రెక్కలు చిన్నవిగా ఉంటాయి. మనుషులను చూస్తే ఇవి భయపడకపోగా ఆసక్తిగా గమనిస్తాయి.
నిప్పుకోడి లేదా ఉష్ట్ర పక్షి
నిప్పుకోడిని ఉష్ట్రపక్షి (Ostrich Birds) అని కూడా అంటారు. ఇవి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రెక్కలున్నప్పటికీ ఎగురలేవు. కానీ వేగంగా పరుగెడతాయి. నిప్పుకోళ్లు పరుగెత్తడం మొదలు పెడితే గంటకు 60 కి.మీ వేగంతో చాలా సేపు రన్నింగ్ చేస్తాయని చెప్తారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల పక్షులుగా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఇక వీటి ఎత్తు విషయానికి సుమారు 9 అడుగుల వరకు పెరుగుతాయి. 300 పౌండ్లకంటే ఎక్కువ బరువు ఉంటాయి. తమ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో రెక్కలను ఉపయోగిస్తాయి.
తకాహే పక్షి
న్యూజిలాండ్‌కు చెందిన అరుదైన ఎగరలేని పక్షిజాతుల్లో తకాహే (Porfirio Hochstetteri) ఒకటి. వీటికి బ్లూయిష్ గ్రీన్ కలర్ ఈకలు, ఎరుపు రంగు ముక్కు ఉంటుంది. ఇవి 1800ల చివరలో అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు భావించారు. కానీ 1948లో సౌత్ ఐలాండ్‌లోని అనేక మూరుమూల లోయ ప్రాంతాల్లో దర్శనమిచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ పక్షులు కేవలం 250 మాత్రమే ఉన్నాయి. ఐయూసీఎన్(IUCN) ప్రకారం అంతరించిపోయే పక్షుల జాబితాలో ఉన్నాయి.
కావసోరి పక్షులు
కావసోరి పక్షులు (Cavasori birds) కాసురియస్ జాతికి చెందిన ఎగరలేని పక్షులు. న్యూ గినియా, ది మొలుక్కాస్, ఈశాన్య ఆస్త్రేలియాలోని ఉష్ణమండల అడవుల్లో ఉంటాయి. వీటిలో మూడు జాతులు ఉన్నాయి. రెక్కలున్నా ఎగరలేవు కానీ.. ఇవి చాలా బాగా జంప్ చేస్తాయి. సుమారు 7 అడుగుల ఎత్తు వరకు ఇవి ఎగరగలవని నిపుణులు చెప్తున్నారు.
కాకపో పక్షులు
గుడ్లగూబ ఆకారంలో ఉండే చిలుకలుగా మాదిరి కనిపించే ఈ కాకపో పక్షులు (Kakapo birds) ఎక్కువగా న్యూజిలాండ్ అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. 64 సెం.మీ పొడవు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత బరువైన పక్షులు కూడా ఇవేనట. రెక్కలు చిన్నగా ఉండటంవల్ల ఎగిరే సామర్థ్యం ఉండదు. అయితే చెట్లపై నుంచి దూకుతున్నప్పుడు తమ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, గాయాలు తగలకుండా తమను తాము కాపాడుకోవడానికి రెక్కలను ఉపయోగించుకుంటాయి.
కివీ పక్షులు
న్యూజిలాండ్‌కు చెందిన ఆప్టరీఫార్మ్స్ ఆర్డర్‌కు(Opterygiformes Order) చెందిన చిన్న చిన్న రెక్కలు కలిగిన ఎగరలేని పక్షులనే కివీ పక్షులు అంటారు. వీటి రెక్కల చివరన ఉండే గోర్లు పిల్లి గోర్ల మాదిరి కనిపిస్తాయి. అయితే న్యూజిలాండ్‌లో కివీ పక్షులు, (Kiwi birds) గబ్బిలాలు తప్ప ఇతర జంతువులు చాలా అరుదుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.