కోళ్లఫారమ్‌లో పనిచేస్తున్నారా.. ? ఇది మీ కోసమే..

మీకు బాల్కనీలో పక్షులకు ఆహారం పెట్టడం ఇష్టమా? అయితే మీరు ‘బర్డ్ బ్రీడర్ లంగ్ డిసీజ్’ అనే శ్వాసకోశ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉంది.

Update: 2023-03-10 10:54 GMT

దిశ, ఫీచర్స్ : మీకు బాల్కనీలో పక్షులకు ఆహారం పెట్టడం ఇష్టమా? అయితే మీరు ‘బర్డ్ బ్రీడర్ లంగ్ డిసీజ్’ అనే శ్వాసకోశ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం చూపే ఈ వ్యాధి ‘సైలెంట్ కిల్లర్’ కాగా.. దీనిని ఏవియన్ హైపర్సెన్సిటివిటీ న్యూమోనిటిస్ (Avian Hypersensitivity Pneumonitis) అని కూడా పిలుస్తారు. పక్షులు, కోళ్ల పెంపకం దారులు, వాటిని సేల్ చేసే దుకాణాల్లో, పరిశ్రమల్లో పనిచేసేవారు.. వాటి విసర్జిత పదార్థాల దుమ్ము, ఈకల ధూళీకి ఎక్స్‌పోజ్ కావడం వల్ల వ్యాపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకైతే దీని నిర్ధారణ పద్ధతులు అందుబాటులో లేవు. కానీ సదరు వ్యక్తి శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మాత్రమే దాని లక్షణాలు బయటపడతాయి.

వ్యాధి లక్షణాలు

*శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

* దగ్గు, జ్వరం, ఛాతి బిగుతుగా అనిపించడం, అలసట

* నెలల నుంచి సంవత్సరాల వ్యవధిలో సింప్టమ్స్

* లంగ్ టిష్యూ డ్యామేజ్ (ఫైబ్రోసిస్)

* దీర్ఘకాలిక శ్వాసకోశ వైఫల్యం

నివారణే చక్కటి మార్గం

దగ్గు, జ్వరం, శ్వాస కోశ ఇబ్బందులు కలిగి ఉండే వ్యక్తులు పక్షులు, కోళ్లు, వాటి రెట్టలకు దూరంగా ఉండటమే చక్కటి నివారణా మార్గం. ఒకవేళ తప్పదనుకుంటే రక్షణ పరికరాలు ఉపయోగించాలి. వ్యాధిని మొదట్లో గుర్తించడం కష్టం. తీవ్రమయ్యాక మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించడానికి డాక్టర్లు కార్టికోస్టెరాయిడ్స్ వంటివి ఇస్తారు. వ్యాధి చివరి దశలో ఊపిరితిత్తుల మార్పిడి అవసరం కావచ్చు. భారతదేశంలో బర్డ్ బ్రీడర్స్ వ్యాధికి సంబంధించిన అనేక కేసులకు ఊపిరితిత్తుల మార్పిడిని డాక్టర్లు సూచిస్తున్నారని నిపుణులు చెప్తున్నమాట.

Also Read..

Sun: భూమిపై నీరు సూర్యుని కంటే పాతది: అధ్యయనం 

Tags:    

Similar News