బక్కగా ఉన్నామని బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి!
చాలా మంది బక్కగా ఉండి ఇబ్బంది పడుతుంటారు. వారు లావు కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించదు. ఇంకొందరైతే లావు కావడానికి ఏకంగా మెడిసిన్ వాడటం లాంటిది కూడా చేస్తారు
దిశ, ఫీచర్స్ : చాలా మంది బక్కగా ఉండి ఇబ్బంది పడుతుంటారు. వారు లావు కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించదు. ఇంకొందరైతే లావు కావడానికి ఏకంగా మెడిసిన్ వాడటం లాంటిది కూడా చేస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండి, త్వరగా బరువు పెరగాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే కొంత మంది కొన్ని కొన్ని కారణాల వలన బరువు పెరగకుండా ఉంటారు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే బరువు తక్కువగా ఉంటారు. ఇంకొంత మంది థైరాయిడ్ సమస్య, జన్యుపరమైన కారణాల వలన బక్కగానే ఉండి పోతారు. అయితే త్వరగా లావు కావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. దీని వలన ఈజీగా లావు అవుతారు.
1. ప్రతి రోజూ ఉదయం గ్లాస్ పాలు, ఉడకబెట్టిన ఒక ఎగ్ తినాలి. అలాగే రోజుకు పిడికెడు బాదం, పిస్తా, అక్రోట్, వేరుశనగ గింజలు తినాలి.
2. రోజుకు లీటర్ నీళ్లు తాగడం తప్పనిసరి
3. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా, వెన్న తీయని పాలు, మీగడ, తీయని పెరుగు కూడా కనీసం ముప్పావు లీటరు వరకు తీసుకోవడం వలన లావు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
4. తాజా పండ్లు.. రోజుకు ఒక్కసారైనా కనీసం రెండు పండ్లు తీసుకోవడం మంచిది.
5. సాయంత్రం గ్లాస్ పాలు, రెండు కర్జూరాలు, ఉడకబెట్టిన ఎగ్ తప్పని సరిగా తినాలి.
6. పప్పుధాన్యాలు..బఠానిలు, శనగల వంటి వాటిని వేయించి తింటూ ఉండాలి.
7.కాఫీ, టీలకు చాలా దూరంగా ఉండాలి.
8. వాకింగ్ అనేది తప్పనిసరి, శారీరక శ్రమ చేయడం వలన కూడా ఆకలి పెరిగి త్వరగా లావు అవుతారు.