Lungs health: ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే బెస్ట్ ఆహారాలు..!

‘వేలాది సన్నని గొట్టాలను కలిగి ఉండే ఊపిరితిత్తులు శరీరం గుండా రక్తాన్ని తరలించే సిరలు, ధమనుల వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటాయి’.

Update: 2024-09-20 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘వేలాది సన్నని గొట్టాలను కలిగి ఉండే ఊపిరితిత్తులు శరీరం గుండా రక్తాన్ని తరలించే సిరలు, ధమనుల వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటాయి’. కొన్నిసార్లు లంగ్స్ కొన్ని వ్యాధుల కారణంగా బలహీనపడతాయి. ఇన్ఫెక్షన్ బారిన పడడం, బ్యాక్టీరియా, వైరస్ సోకడం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటివి లంగ్స్‌ సామర్థాన్ని తగ్గిస్తాయి. చాలా మంది తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతారు. దీంతో ఊపిరితిత్తులు వాపు వస్తాయి. ఊపిరితిత్తుల దిగువ భాగాల్లో న్యుమోనియా ఉన్నవారిలో తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది .

తరచూ శ్వాస ఆడకపోవడం, COPD, ఆస్తమా, పల్మనరీ ఫైబ్రోసిస్ అండ్ పల్మనరీ హైపర్‌టెన్షన్‌, గుంండె సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ లక్షణాలు నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య స్థితికి సంకేతం కావచ్చని చెబుతున్నారు.

అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే.. పై వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే లంగ్స్ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బీట్‌రూట్ జ్యూస్..

మీ ఊపిరిత్తులకు బలాన్ని ఇచ్చే బీట్‌రూట్ జ్యూస్ ప్రతిరోజూ తాగండి. దీనిలో ఉండే సమ్మేళనాలు లంగ్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ జ్యూస్ పోషకాహారాన్ని అందించి.. శక్తిని పెంచుతుంది. వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్‌‌‌ను నిరోధించడంలో బీట్‌రూట్ జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది.

పసుపు..

ప్రథమ చికిత్సగా ఉపయోగించే పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. పసుపు చర్మ సౌందర్యానికి, శ్వాసకోశ సమస్యలకు, అల్జీమర్స్ వ్యాధి నివారణకు, క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే పసుపులో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం లంగ్ ఫంక్షన్‌కు మేలు చేస్తుంది.

గుమ్మడికాయ..

బీటా-కెరోటిన్, విటమిన్లు సి ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గుమ్మడికాయతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారించడంలో మేలు చేస్తుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ దరి చేరకుండా చేస్తుంది. గుమ్మడికాయ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే కెరటనాయిడ్స్ లంగ్స్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డార్క్ చాక్లెట్స్..

డార్క్ చాక్లెట్స్‌ను చాలా మంది ఇష్టపడుతారు. వీటిలో ఫ్లేవనాయిడ్స్, థియోబ్రొమైన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. లంగ్స్‌కు గాలి అందించే గొట్టాలను క్లన్ చేయడంలో డార్క్ చాక్లెట్స్ ఎంతగానో మేలు చేస్తాయి.

ఆపిల్స్..

పాడైన ఊపిరితిత్తులను బాగు చేయడంలో ఆపిల్స్ సహాయపడతాయి. వీటిలో క్విర్కెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లంగ్స్ వయస్సును తగ్గిస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఊబకాయం,తలనొప్పి, కీళ్లనొప్పులు, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

బెల్ పెప్పర్స్ అండ్ తృణ ధాన్యాలు..

బెల్ పెప్పర్స్‌లో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తులకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే ఊపిరితిత్తుల సామర్థాన్ని మెరుగుపర్చడంలో తృణ ధాన్యాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే కనుక వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News