సేతు బంధాసనం వలన కలిగే ప్రయోజనాలు
ముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి.. పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి. భుజాలు, పాదాలు బేస్ చేసుకుని.. నడుము భాగాన్ని
దిశ, ఫీచర్స్: ముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి.. పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి. భుజాలు, పాదాలు బేస్ చేసుకుని.. నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపై ఉండాలి. ఈ పొజిషన్లో కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
ప్రయోజనాలు
* బ్యాక్ మజిల్స్‌ను బలపరుస్తుంది.
* అలసిపోయిన వీపుకు తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది.
* ఛాతీ, మెడ, వెన్నెముకకు మంచి స్ట్రెచ్ ఇస్తుంది.
* ఆందోళన, ఒత్తిడి, నిరాశను తగ్గించి.. మెదడును ప్రశాంత పరుస్తుంది.
* ఊపిరితిత్తులను తెరుస్తుంది, థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
* రుతువిరతి, రుతునొప్పి లక్షణాల నుంచి ఉపశమనం.
* ఉబ్బసం, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి, సైనసైటిస్ నివారణలో సహాయపడుతుంది.
Also Read: Parivrtta Parsvakonasana ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?