ఆలివ్ నూనెతో దీర్ఘాయువు.. ఎలా సాధ్యమవుతుంది?
మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా కలిగిన ఆలివ్ అయిల్.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దిశ, ఫీచర్స్ :
- మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా కలిగిన ఆలివ్ అయిల్.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- యాంటీ ఇన్ ఫ్లమెటరీ సమ్మేళనాలు ఆర్థరైటిస్, గుండె జబ్బులతో సహా వివిధ అనారోగ్యాలతో ముడిపడిన మంట, నొప్పి తగ్గిస్తాయి. తాపజనక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను కాపాడుతాయి. క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి దీర్ఘాయువుకు మద్దతు ఇస్తాయి.
- డిజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఆహారాన్ని సమర్ధవంతంగా విచ్ఛిన్నం చేయడంలో , మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- ఆలివ్ ఆయిల్ కొవ్వులో కరిగే విటమిన్లు, ఇతర ఆహారాల నుంచి ప్రయోజనకర యాంటీ ఆక్సిడెంట్ల శోషణను పెంచుతుంది. భోజనం నుంచి శరీరానికి గరిష్ట పోషక విలువను అందిస్తుంది.