బీ అలర్ట్: మొబైల్ కవర్‌లో డబ్బులు పెడుతున్నారా? ప్రాణాలకే ప్రమాదం..!
సాధారణంగా ఎవ్వరైనా 10, 20, 50, 100 రూపాయల నోట్లను చాలా మంది ఫోన్ కవర్ వెనకాల పెట్టుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఎవ్వరైనా 10, 20, 50, 100, 500 రూపాయల నోట్లను చాలా మంది ఫోన్ కవర్ వెనకాల పెట్టుకుంటారు. మన దేశంలో ఈ అలవాటు ఎక్కువ మందికి ఉంది. అయితే కరెన్సీ నోట్లను మొబైల్ వెనుక పెట్టడం వల్ల ప్రాణాలకే ప్రమాదమంటున్నారు నిపుణులు. ఫోన్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు లేకపోతే ఛార్జింగ్ పెట్టినప్పుడు కామన్‌గా ఎవ్వరి ఫోనైనా వేడెక్కుతుంది. దీంతో ఫోన్ వెనకాల పెట్టిన మనీకి గాలి తగలక సెల్ పేలిపోయే ప్రమాదముందని అంటున్నారు. ఈ కరెన్సీ నోట్లను తయారు చేసేందుకు కాగితంతో పాటు ఎన్నో రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తుంటారట. ఈ రసాయనాలు కూడా ఫోన్ వేడిని బయటకు వెళ్లకుండా ఆపుతాయట. దీంతో ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కాగా ఫోన్ నుంచి వేడి బయటకు వెళ్లే వీలుండే కవర్ తీసుకోవాలని సూచిస్తున్నారు.