పక్కనున్న వారి నుంచి ప్రతి ఒక్కరికీ త్రెట్ ఉంటది.. ఆ ప్రమాదాన్ని గుర్తించే సాధనమిదే!

మీరు నిరంతరం కఠిన విమర్శలకు గురైతే.. మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనిపిస్తే.. మిమ్మల్ని కిందకు లాగేందుకు ట్రై చేస్తున్నట్లు భావిస్తే.. కొన్ని సంకేతాలతో ఫైనలైజ్ చేసుకోమని చెప్తున్నారు నిపుణులు. సైకాలజీ

Update: 2024-08-27 17:41 GMT

దిశ, ఫీచర్స్ : మీరు నిరంతరం కఠిన విమర్శలకు గురైతే.. మీ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనిపిస్తే.. మిమ్మల్ని కిందకు లాగేందుకు ట్రై చేస్తున్నట్లు భావిస్తే.. కొన్ని సంకేతాలతో ఫైనలైజ్ చేసుకోమని చెప్తున్నారు నిపుణులు. సైకాలజీ ప్రకారం ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి...కాన్ స్టాంట్ నెగేటివిటీకి మధ్య తేడా ఇలా ఉంటుందని చెప్తున్నారు. మరి మీరు నిజంగానే టార్గెట్ చేయబడ్డారా లేక మీకే అలా అనిపిస్తుందా అనేది ఇలా తెలుసుకోమని చెప్తున్నారు.

సక్సెస్ తక్కువ చేయడం

ఎవరైనా మీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదా మీ వర్క్ కు క్రెడిట్స్ ఇవ్వకపోవడం జరుగుతుందేమో చూసుకోండి. ఇదే జరిగితే కచ్చితంగా మీరు నెగెటివ్ గా పిక్చరైజ్ చేయబడుతున్నట్లే అని నిర్ధారించుకోండి.

ప్రతీది వ్యతిరేకమే

తప్పుడు సమాచారాన్ని అందించడం లేదా అనవసరమైన అడ్డంకులు సృష్టించడం ద్వారా మీ ఎదుగుదలను అడ్డుకుంటుంటే.. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందని కన్ఫర్మ్ చేసుకోండి. ఇది మీ లైఫ్ లో రెడ్ ఫ్లాగ్ గా గుర్తించండి.

అగ్రెసివ్ బిహేవియర్

పొగుడుతూనే సైలెంట్ గా అవమానిస్తూ ఉండడం.. ఇండైరెక్ట్ గా శత్రుత్వం అవుతుందని గ్రహించండి. ఇది ఎదుటివ్యక్తి మీపై పెంచుకుంటున్న అసూయ కిందకు వస్తుంది.

గాసిప్ అండ్ రూమర్స్

మీ గురించి తప్పుడు లేదా హానికరమైన కథనాలు ప్రచారం చేయడం.. మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉపయోగించే వ్యూహంగా గుర్తించండి. కాబట్టి మీ గురించి గాసిప్, రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నట్లు అనిపించడం.. మీ దగ్గరి వాళ్లతో దూరం చేసేందుకు ప్రయత్నిస్తే జాగ్రత్త వహించండి.

ఇంపార్టెంట్ ఇష్యూస్ కు దూరం

సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఇంపార్టెంట్ మీటింగ్స్, సోషల్ ఈవెంట్స్ నుంచి మిమ్మల్ని కావాలనే దూరం చేస్తారు. అనుకోకుండా జరిగినట్లు చిత్రీకరిస్తారు. కానీ ఇది మిమ్మల్ని తక్కువ చేసేందుకు జరిగే ప్రయత్నమే

Tags:    

Similar News