అంగానికి అరటి పండుకు ఇంత సంబంధం ఉందా..?
నేటి యువత ఎక్కువగా రొమాన్స్ చేయడానికి ఉవ్విళ్లు ఊగుతున్నారు. అయితే ఫాస్ట్ ఫుడ్, కాలుష్యం, ఆహారంలో విషపూరిత మందుల ప్రభావంతో యువకుల్లో సెక్స్ సామర్ధ్యం రోజురోజుకు తగ్గిపోతుంది.
దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువత ఎక్కువగా రొమాన్స్ చేయడానికి ఉవ్విళ్లు ఊగుతున్నారు. అయితే ఫాస్ట్ ఫుడ్, కాలుష్యం, ఆహారంలో విషపూరిత మందుల ప్రభావంతో యువకుల్లో సెక్స్ సామర్ధ్యం రోజురోజుకు తగ్గిపోతుంది. ఈ క్రమంలో భాగస్వామిని సంతృప్తి పరచలేకపోతున్నారు. దీని వల్ల కుటుంబాల్లో కలతలు ప్రారంభం అవుతున్నాయి. అయితే చిన్న చిన్న చిట్కాలు, నిత్యం అందుబాటులో ఉండే కొన్ని పండ్లతోనూ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అరటి పండు అంగానికి బలమని చెబుతున్నారు. అసలు అంగానికి, అరటి పండుకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం.
అరటి పండు చూడటానికి పురుషాంగాన్ని పోలి ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా అరటి పండును సెక్స్‌కు ప్రతిరూపంగా చూసేవారట. భారతదేశంలో అరటి పండును సంతాన ఉత్పత్తికి దివ్వ ఔషధంగా భావిస్తారు. మధ్య అమెరికాలో ఎర్రటి అరటిపండు రసాన్ని శృంగార సామర్థ్యాన్ని పెంచే టానిక్‌గా సేవిస్తారు. దీనికి ఇంత ప్రాధాన్యం ఉండటానికి కారణం.. ఈ పండులో కీలేటింగ్ లవణాలు, బ్రోమెలిన్ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. వీటి వల్లనే అరటిపండు పురుషుడిలో లైంగిక శక్తిని పటిష్టంగా పెంచుతుందని వైద్య పరిశోధనల్లో తేలింది.