నవజాత శిశువుల బ్రెయిన్‌లో ప్రత్యేక సిగ్నల్.. నాలుగు నెలలకే ఆ పని స్టార్ట్ చేస్తున్న పిల్లలు!

పిల్లలు కార్లు లేదా వర్ణమాల అక్షరాల కంటే ముందుగా వ్యక్తుల ముఖాలను గుర్తించగలుగుతారని నిర్ధారించింది తాజా అధ్యయనం.

Update: 2023-05-30 11:11 GMT

దిశ, ఫీచర్స్: పిల్లలు కార్లు లేదా వర్ణమాల అక్షరాల కంటే ముందుగా వ్యక్తుల ముఖాలను గుర్తించగలుగుతారని నిర్ధారించింది తాజా అధ్యయనం. నాలుగు నెలల వయసు ఉన్న శిశువులు ఒకరి ముఖం చూసినప్పుడు మెదడు ప్రత్యేకమైన సిగ్నల్‌ను ఉత్పత్తి చేస్తారని పరిశోధకులు కనుగొన్నారు. కొంతమంది పిల్లలు ఈ వయస్సులో అపరిచితులని చూసి భయపడేందుకు కారణం ఇదేనని తెలిపారు. ఇక నవజాత శిశువుల కంటి చూపు 12 అంగుళాలకు పరిమితం చేయబడి ఉండటం వలన తెలిసిన ముఖాలను చూడటానికి ఇష్టపడతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు నుంచి నాలుగు నెలల వరకు.. శిశువు తన ప్రాథమిక సంరక్షకుల ముఖాలను గుర్తించడం ప్రారంభిస్తుందని.. ఆరు నెలల తర్వాత ఈ సామర్థ్యం పెరుగుతూ వస్తుందని తెలిపారు పరిశోధకులు.  

Also Read..

ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమ.. అరుదైన సైకియాట్రిక్ డిజార్డర్స్.

Tags:    

Similar News