మొటిమలు వేధిస్తున్నాయా? తులసి ఆకులను ఇలా వాడండి..

స్కిన్ గ్లోయింగ్ కోసం, మొటిమల నివారణ కోసం మార్కెట్లో లభించే వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొనలేక, కొన్నా వాటి వల్ల ఫలితం లేక నిరాశ చెందుతుంటారు కొందరు.

Update: 2023-12-23 15:35 GMT

దిశ, ఫీచర్స్: స్కిన్ గ్లోయింగ్ కోసం, మొటిమల నివారణ కోసం మార్కెట్లో లభించే వివిధ బ్యూటీ ప్రొడక్ట్స్‌ కొనలేక, కొన్నా వాటి వల్ల ఫలితం లేక నిరాశ చెందుతుంటారు కొందరు. కానీ ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడంతోపాటు మొటిమలను నివారించగలిగే అద్భుతమైన గుణం తులసి ఆకులకు ఉందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మొహంపై మచ్చలేని నిగారింపు సొంతం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నారు. తరచూ మొటిమలు వేధిస్తున్నవారు రోజు రెండు తాజా తులసి ఆకులను తినడం వల్ల కొంత కాలానికి మొటిమలు తగ్గుముఖం పడతాయట.

అంతేకాకుండా ఆ ఆకులను మొత్తగా నూరి మొటిమలపై పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. ముఖ సౌందర్యం కూడా పెరుగుతుంది. ఇక తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చిన నీటిని టోనర్‌గానూ వాడుకోవచ్చు. దీనివల్ల మొటిమలు తగ్గడంతో పాటు స్కిన్ అలర్జీలు ఉంటే పోతాయి. ఇక ఈ ఆకుల పొడిని రోజ్‌ వాటర్‌తో కలిపి ముఖానికి పట్టించినా.. చర్మంపై పొక్కులు, దురద వంటి ఇబ్బందులు తొలుగుతాయి. నల్లటి మచ్చలు కూడా పోతాయి.


Similar News