Best beauty tips: అబ్బాయిలూ హ్యాండ్సమ్గా కనిపించాలనుకుంటున్నారా.. ఈ టిప్స్‌తో హీరోలాంటి లుక్ మీ సొంతం
నేటితరం యువత అందంగా, స్టైలిష్‌గా కనిపించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: నేటితరం యువత(youth) అందంగా, స్టైలిష్‌గా కనిపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందం విషయంలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదండోయ్.. అబ్బాయిలు కూడా ప్రజెంట్ డేస్‌లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాకపోతే అమ్మాయిలకు సమానంగా లేరనుకోండి. సాధారణంగా అమ్మాయిలూ బ్యూటీగా కనిపించేందుకు రకరకాల ఫ్యాషన్ డ్రెస్సెస్(Fashion Dresses), పలు బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty products), హెయిర్ స్టైల్స్(Hair styles) వంటి చేసుకుంటారు.
మరీ అబ్బాయిలూ కూడా ఏమాత్రం తగ్గకుండా డ్రెస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్(Special care) తీసుకుంటున్నారు. కామన్‌గా అయితే అబ్బాయిలూ ఏదో ఒక డ్రెస్ వేసుకుని పోతుంటారు. కానీ కొంతమంది స్టైలిష్ తో పాటు కూల్ గా కనిపించేందుకు డ్రెస్సింగ్ సెన్సే కాకుండా హీరో లాంటి లుక్ కోసం ఈ చిట్కాలు పాటిస్తే నలుగురిలో హ్యాండ్సమ్(Handsome)గా మెరిసిపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మగాళ్లు హ్యాండ్సమ్ గా కనిపించేందుకు మేకప్ ఉత్పత్తులు(Makeup products) ఎంచుకోవడం బెటర్. ప్రస్తుత రోజుల్లో మహిళలకే కాదు.. పురుషుల కోసం కూడా మార్కెట్లోకి మేకప్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కాగా మీ స్కిన్ టోన్‌కు సరిపోయే ఫౌండేషన్(Foundation) ఎంపిక చేసుకుంటే మీ ఫేస్‌లో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. మేకప్ ఇష్టం లేనివారు బిబి క్రీమ్(BB cream) వాడవచ్చు. ఇది స్కిన్ ను మెరుగుపరుస్తుంది.
మొటిమల(acne) వల్ల ముఖం అంత ఆకర్షణీయంగా కనిపించదు. కాగా పింపుల్స్, మచ్చలు ఉంటే కన్సీలర్(Concealer) ఉపయోగించండి. అలాగే మగాళ్లు ఫేస్ పౌడర్(Face powder) వాడితే మేకప్ సహజంగా కనిపిస్తుంది. పెదవుల సంరక్షణ(Lip care) కోసం లిప్ బామ్(Lip balm) యూజ్ చేయండి. లిప్ బాయ్ పెదవులను మృదువుగా ఉంచడమే కాకుండా ముఖానికి మెరుపునిస్తుంది.