అసత్య ఆరోపణల మీద సంపూర్ణ విచారణ జరిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు

అసత్య ఆరోపణల మీద సంపూర్ణ విచారణ జరిపించాలని

Update: 2024-11-20 06:29 GMT

దిశ,మంథని : అసత్య ఆరోపణల మీద సంపూర్ణ విచారణ జరిపించాలని గత రెండు రోజులుగా బీజేపీ నాయకుడు చేసిన అసత్య ఆరోపణలు, రాజకీయ లబ్ధి కోసం,ఎంతకైనా దిగజారిపోయే నీచ సంస్కృతి జుగుప్స కలిగిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.సామాజిక మాధ్యమాలలో ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న ధోరణి పెరిగిపోయింది,ఇటువంటి నీచ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది.సామాజిక మాధ్యమాలలో చేసిన అసత్య ఆరోపణల మీద సంపూర్ణ విచారణ జరిపించాలని, నిస్పక్షపాతంగా వ్యవహరించిన నిజానిజాలను వెలికి తీయాలని, వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని రాష్ట్ర డీజీపీ ని మంత్రి శ్రీధర్ బాబు లిఖిత పూర్వకంగా కోరారు.


Similar News