Beauty Tips: అరబిక్ మహిళల ముఖచర్మం పింక్ కలర్‌లో ఎందుకు ఉంటుంది.. రహస్యమిదే?
మచ్చలేని.. ప్రకాశవంతంగా మెరిసే చర్మం కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: మచ్చలేని.. ప్రకాశవంతంగా మెరిసే చర్మం(Glowing skin) కావాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. కాగా నలుగురిలో అందంగా కనిపించడం కోసం కొంతమంది పలు బ్యూటీ ప్రొడక్ట్స్(Beauty products) వాడుతుంటారు. మరికొంతమంది ఇంటిచిట్కాలు(household tips) ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆడవాళ్లు అయితే.. గంధం(sandalwood), పసుపు(Pasupu), శనగపిండి(Groundnut), పెరుగు(curd) వంటి ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇకపోతే అరబిక్ మహిళల(Arabic women)ను చూసే ఉంటారు. వారి బుగ్గలు పింక్ కలర్(Pink color)లో ఉంటాయి. అందరూ వారు నివసించే వాతావరణం అలాంటిది.. చల్లగా ఉంటుందని కాబట్టి వారు ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటారని భావిస్తారు. కానీ వాస్తవానికి అయితే అరబిక్ వారు బుగ్గలపై పింక్ రంగు రావడానికి పలు చిట్కాలు పాటిస్తారట. ఈ విషయాన్ని ఓ పాకిస్తానీ వైద్యురాలు(Pakistani doctor) షిరీన్ ఫాతిమా(Shireen Fatima) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ టిప్స్ కూడా వివరించింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..
తేలికపాటి ఫేస్ సోప్(Face soap), మందార పువ్వు(Hibiscus flower), బియ్యం పిండి(rice flour) ఒక టీ స్ఫూన్, టీస్ఫూన్ బీట్‌రూట్ పౌడర్(Beetroot powder), టీస్ఫూన్ మొక్కజొన్న పిండి(Corn flour), టీస్ఫూన్ పాలపొడి(milk powder) తీసుకోవాలి.
ముందుగా పువ్వులను ఒక గ్లాసు వాటర్‌లో 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో సోస్‌ను తురిమి.. అదే గిన్నెలో బీట్ రూట్ పౌడర్,పాలపొడి, బ్యియ్యం పిండి, మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టిన మందార వాటర్‌ను పోసి బాగా కలుపుకోవాలి.
దీన్నంతా మిక్స్ చేసి.. పేస్ట్ లా తయారయ్యాక ఐస్ క్యూబ్ ట్రే(Ice cube tray)లో వేసి సెట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో కొన్ని గంటలు ఉంచితే చాలు. ఇక ఈ ఐస్ క్యూబ్స్‌ను మీ దిన చర్యలో భాగంగా ఉపయోగించుకోవచ్చు. ఒక వారం పాటు వస్తాయి. డైలీ మార్నింగ్(Daily Morning) లేచాక ఫేస్‌పై రుద్దితే బ్రైట్‌గా అవ్వడమే కాకుండా పింక్ కలర్‌లోకి ఛేంజ్ అవుతుంది.