Fertility: సంతానోత్పత్తిని మెరుగుపరుస్తోన్న అద్భుతమైన టీ.. అనేక పరిశోధనల్లో రుజువు!!

అశ్వగంధ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Update: 2024-09-28 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: అశ్వగంధ అనేది ఒక ఆయుర్వేద మూలిక. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అశ్వగంధ టీ తాగడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టొచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తనాళాలను శుభ్రపరచడం, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడం.. అలాగే అశ్వగంధ కండరాలను బలోపేతం చేయడంలో ఎంతో తోడ్పడుతుంది. రాత్రిపూట అశ్వగంధ టీ తాగితే స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

సంతానోత్పత్తికి మేలు చేస్తోన్న అశ్వగంధ టీ..

ప్రెగ్నెన్నీ సమస్యతో బాధపడుతోన్న స్త్రీలు, అప్పుడే తల్లైన వారు ప్రతిరోజూ 1/4 నుంచి 1 టీస్పూన్ అశ్వగంధ పొడిని తీసుకుంటారు. అశ్వగంధ స్త్రీ సంతానోత్పత్తిని మెరుగుపర్చడంతో పాటు మరిన్ని ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తుంది. అండాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతకుమించి బాడీకి ఆహ్లాదకరమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. మానసిక అండ్ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అనేక పరిశోధనల్లో రుజువు..

ఈ అశ్వగంధ టీ రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. చాలా మంది ఫిట్ నెస్ కోసం తాగుతారు. ఆటగాళ్లు ఈ టీ తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతారు. అనేక పరిశోధనల్లో కూడా రుజువైంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి. కణజాల దెబ్బతినకుండా కాపాడుతుంది. దీంతో వృద్ధాప్య లక్షణాలు లేట్ గా కనిపిస్తాయి.

ఈ వ్యాధులు దూరం..

మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. వృద్ధుల్లో అల్జీమర్స్ వంటి డిజెనరేటివ్ వ్యాధులు దూరమవుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడంలో అశ్వగంధ టీ ఎంతో సహాయపడుతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News