ఈ ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా? డేంజర్లో పడ్డట్లే

ప్రజెంట్ డేస్‌లో చాలా మంది బయట వేయించిన ఫుడ్ తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Update: 2024-09-18 02:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో చాలా మంది బయట వేయించిన ఫుడ్ తినడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాగే జీవనశైలిలో మార్పుల కారణంగా బిజీ షెడ్యూల్ కారణంగా సమయానికి సరైన ఫుడ్ కూడా తీసుకునే సమయం ఉండట్లేదు. కాగా బయట రెస్టారెంట్లలో, రోడ్ సైడ్, బేకరీ ఎక్కడపడితే అక్కడ అవైలేబుల్ ఉన్న చోట, అందుబాటులో ఉన్న ఫుడ్‌ను తీసుకుంటున్నారు. కానీ కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాగా బాడీలో చెడు కొలెస్ట్రా‌ల్‌ను తగ్గించుకోవడం కోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలని తరచూ నిపుణులు సూచిస్తూనే ఉంటారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరడానికి ముఖ్య కారణం జంక్ ఫుడ్ అని న్యూట్రిషనిస్టులు, వైద్యులు చెబుతూనే ఉంటారు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ చేర్చే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బాగా వేయించిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం ఖాయమని అంటున్నారు నిపుణులు. స్ట్రీట్ ఫుడ్ సైతం చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ముందుంటుంది. రెడ్ మీట్ హెల్త్ పాడు చేసే పదార్థాల్లో ఒకటి. బేకరీ ఫుడ్ (కేక్స్, క్రిమ్ బన్స్ లాంటివి), అలాగే వెన్న, పాలు, చీజ్ కూడా కొలెస్ట్రాల్ పెంచుతుంది. కాగా ఈ పదార్థాలకు దూరంగా ఉండటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Similar News