విపరీతంగా గురక పెడుతున్నారా... మానాలంటే ఇలా చేయండి
గురక.. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉండే అలవాటు. సాధారణంగా నిద్రపోగానే కొంత మందిలో గురక పెట్టడం మొదలు పెడతారు.
దిశ, వెబ్ డెస్క్ : గురక.. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి ఉండే అలవాటు. సాధారణంగా నిద్రపోగానే కొంతమందిలో గురక పెట్టడం మొదలు పెడతారు. దీంతో వారి వల్ల చాలామందికి నిద్రాభంగం అవుతుంది. ముఖ్యంగా ఊబకాయం ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గురకకు లింగ బేధం అంటూ ఏమి లేదు. నిద్రపోతున్న సమయంలో ముక్కుతో శ్వాస తీసుకోవాలి.. కానీ గురక సమస్య ఉన్న వారు నోటితో శ్వాస తీసుకోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యను త్వరితగతిన అధిగమించాలంటూ రోజూ యోగా చేయాలి.
అదేవిధంగా గాలిని నోటితో కాకుండా ముక్కుతో తీసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రాణాయామంతో ముక్కు సాఫీగా మారుతుంది. ముక్కుతో గాలి తీసుకుంటే గురక సమస్య అసలే రాదు. శ్వాస తీసుకునేందుకు సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. దీని వల్ల గురక సమస్యను కొంత వరకు అవకాశం వస్తుంది. అందుకే వీటిని కచ్చితంగా పాటిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. గురక పెట్టే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఆవు నెయ్యిని వేడి చేసి ముక్కులలో వేసుకోవడం, అర చేతికి, కాళ్లకు మర్దన చేయాలి. కొంచెం వాము కషాయం తాగడం వల్ల కూడా గురక సమస్య దూరం అవుతుంది.