Mosquitoes : దోమలతో ఇబ్బందులా..? మీ ఇంట్లో వాడే వస్తువులతో ఇలా తరిమేయండి!

వర్షాకాంలో వేధించే సమస్యల్లో దోమల బెడద ఒక్కటి. డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లకు ప్రధాన కారణం దోమలే.

Update: 2024-09-06 12:59 GMT

దిశ, ఫీచర్స్ : వర్షాకాంలో వేధించే సమస్యల్లో దోమల బెడద ఒక్కటి. డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లకు ప్రధాన కారణం దోమలే. కాబట్టి ఈ సజన్‌లో దోమలు కుట్టకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత, పూట కుండీలు, డ్రమ్ముల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటం వంటి పద్ధతుల ద్వారా దోమల సంఖ్య పెరగకుండా నివారించవచ్చు. అయితే ఇంటిలో కూడా వాటి నివారణకు ఉపయోగడే ఐదు వస్తువులు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

* కర్పూరం : దోమలను తరిమేందుకు కర్పూరం అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రిళ్లు అవి కుట్టకుండా ఉండాలంటే.. తలుపులు, కిటికీలు మూసి కర్పూరం వెలిగించాలి. ఓ 20 నిమిషాల తర్వాత మళ్లీ తెరవాలి. దీంతో కర్పూరం వాసనకు దోమలన్నీ బయటకు వెళ్లిపోతాయంటున్నారు చిట్కా నిపుణులు.

* వెల్లుల్లి : వెల్లుల్లి వాసన దోమలకు అస్సలు పడదట. కాబట్టి దీనిని ఉపయోగించడం ద్వారా దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు. అందుకోసం ఐదారు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఒక బాటిల్‌లో నీళ్లు తీసుకొని అందులో వెల్లుల్లి ముక్కలను వేసి బాగా కలపాలి. ఆ నీళ్లను ఇంటి చుట్టూ చల్లితే దోమలు ఆ పరిసరాల్లోకి రాకుండా ఉంటాయట.

* తులసి ఆకులు : తులసీ ఆకుల వాసనకు దోమలు దూరంగా పారిపోతాయంటున్నారు నిపుణులు. మీ ఇంటిలో వాటి నుంచి రక్షణకోసం తులసీ ఆకల్ని గ్రైండ్ చేయగా వచ్చిన రసాన్ని ఒక స్ర్పే బాటిల్లో నింపాలి. ఆ తర్వాత దానిని ఇంటిలో పిచికారి చేయాలి. రోజూ సాయంత్రం పూట ఇలా చేస్తే రాత్రికి దోమలు కుట్టకుండా ఉంటాయి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News