మీరు శాఖాహారులా?.. ప్రోటీన్ లోపం ఏర్పడ కూడదంటే వీటిని తప్పక తినాలి

వాస్తవానికి మాంసాహారం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు దాని ద్వారా లభిస్తాయి. పైగా ఇవి అధికంగా లభించే వాటిలో చికెన్‌‌ ఒకటి.

Update: 2024-05-31 13:19 GMT

దిశ, ఫీచర్స్ : వాస్తవానికి మాంసాహారం ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు దాని ద్వారా లభిస్తాయి. పైగా ఇవి అధికంగా లభించే వాటిలో చికెన్‌‌ ఒకటి. మాంసాహారులకైతే నో ప్రాబ్లం. కానీ ప్యూర్‌ వెజ్ టేరియన్స్‌కే సమస్య. కాబట్టి వీరు హెల్తీగా ఉండాలంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఎలా పొందాలి?, ఏయే ఆహారాల్లో ఉంటాయో తెలుసుకుందాం.

* పప్పుధాన్యాలు : శరీరంలో ప్రోటీన్స్ లోపిస్తే ఎముకల బలహీనత, కండరాల నొప్పి, బ్యాక్ అండ్ నెక్ పెయిన్ వంటివి వస్తాయి. కాబట్టి వాటిని భర్తీ చేసేలా మన ఆహారపు అలవాట్లు ఉండాలి. నాన్ వెజ్ తినే అలవాటు లేనివారు. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే చిక్కుళ్లను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ప్రతీ వంద గ్రాముల చిక్కుళ్లలలో 9 గ్రాముల వరకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వీటిని తీసుకుంటే మాంసకృత్తులతోపాటు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి.

* మిల్క్ ప్రొడక్ట్స్ : పాలు, పాల ఉత్పత్తులు సహజంగానే ప్రోటీన్ రిలేటెడ్ వనరులుగా పేర్కొంటారు. వీటిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. శారీరక బలాన్ని ఇస్తుంది. పెరుగు, జున్ను వంటి మిల్క ప్రొడక్ట్ మీ డైట్‌లో చేర్చుకోవడంవల్ల తగిన మాంసకృత్తులు, ప్రోటీన్లు పొందవచ్చు.

* బాదం: బాదంలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ వంటి పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతీ వంద గ్రాముల బాదం పప్పులో 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి రెండు మూడు రోజులకు ఒకసారైనా బాదం పప్పులను మీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* చియా సీడ్స్, సోయాబీన్: మొక్కల ద్వారా లభించే విత్తనాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు చియా సీడ్స్. ఇందులో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అలాగే వేరు శెనగ, సోయాబీన్, ఇతర నట్స్‌లో కూడా ప్రతి వంద గ్రాములకు 36 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని రెగ్యులర్ ఫుడ్స్‌లో భాగంగా తీసుకుంటూ ఉండాలి. 


Similar News