Home tips: బట్టలపై ఆ మరకలు పోవడం లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
ప్రస్తుతం టీ, కాఫీ వంటివి తాగనిదే చాలా మందికి పొద్దు గడవదు. అయితే కొన్నిసార్లు అలా తాగుతున్నప్పుడు అనుకోకుండా కదలడంవల్లో, ఏదైనా వస్తువు తాకడంవల్లో, సరిగ్గా పట్టుకోకపోవడం వల్లో టీ ఒలికి పోతుంది.
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం టీ, కాఫీ వంటివి తాగనిదే చాలా మందికి పొద్దు గడవదు. అయితే కొన్నిసార్లు అలా తాగుతున్నప్పుడు అనుకోకుండా కదలడంవల్లో, ఏదైనా వస్తువు తాకడంవల్లో, సరిగ్గా పట్టుకోకపోవడం వల్లో టీ ఒలికి పోతుంది. అది బట్టలపై మరకలుగా ఉండిపోతుంది. సాధారణ పద్ధతిలో తుడిచినా, ఉతికినా అది పూర్తిగా తొలగిపోదు. అలాంటప్పుడు టీ మరకను పోగొట్టే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏమిటో చూద్దాం.
* నిమ్మకాయ : నిమ్మకాయలో మరకల్ని పోగొట్టే ఆమ్లగుణం ఉంటుంది. కాబట్టి మీ బట్టలపై టీ మరకలు పోవాలంటే దీనిని యూజ్ చేయవచ్చు. ముందుగా నిమ్మకాయను కట్ చేయండి. తర్వాత దానిలోపలి గుజ్జును తీసి ఓ గుడ్డలో చుట్టి మరకలు పడిన ప్రదేశంలో రుద్దాలి. తర్వాత బట్టలు ఉతికితే మరకలు మాయం.
* వెనిగర్ : దీని గురించి తెలిసిందే. టీ మరకలు పడిన బట్టలపై అప్లై చేయడం ద్వారా వాటిని పోగొట్ట వచ్చు. అందుకోసం ముందుగా ఒక బకెట్‌లో నీరు తీసుకోండి. అందులో అరకప్పు వెనిగర్ కలపండి. తర్వాత అందులో టీ మరక పడిన బట్టలను 20 నిమిషాలకు పైగా నానబెట్టండి. ఆ తర్వాత ఉతికితే కనిపించకుండా పోతాయ్.
* బంగాళ దుంప : బంగాళ దుంపలను కూడా టీ మరకలు పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. ముందుగా వాటిని ఉడక బెట్టండి. తర్వాత పొట్టు తీసి మరక ఉన్నచోట రుద్ది.. కాసేపటి తర్వాత ఉతికితే మరక క్షణాల్లో మాయం అంతే!
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.