Mental health: నెగెటివ్ థింకింగ్స్ వస్తున్నాయా..? ఇలా చేస్తే చాలు !
ఈ రోజుల్లో చాలా మందికి నెగిటివ్ థింకింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది.
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో చాలా మందికి నెగిటివ్ థింకింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు నెగిటివిటీని ఫేస్ చేస్తుంటారు. ఈ ఆలోచనతో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారమని చెబుతున్నారు నిపుణులు. పనిలో ఒత్తిడి, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పాజిట్‌గా ఆలోచించడమే మానేస్తుంటారని చెబుతున్నారు.
ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిరంతరం ఆలోచిస్తూ ఉండడం వల్ల ఒత్తిడికిలోనై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందట. ఈ నెగిటివ్‌గా ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. అంతేకాకుండా సంబంధాలపైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే నెగిటివ్‌గా ఆలోచించడం మానేయాలి. పాజిటివ్‌గా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.
అలవాట్లు మార్చుకోవడం: నిద్ర లేచిన తరువాత మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతీరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. ఇది మీ మూడ్‌ని మార్చడమే కాకుండా..నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది.
తక్కువ అంచనా వేసుకోకండి: మీరు ఏదైనా పని చేస్తసున్నప్పుడు ఆ పని మీకు నచ్చికపోతే దాని గురించే ఆలోచిస్తూ, ఆ పని చేయలేనంటూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మూడ్‌ని రీ ప్లేస్ చేయడానికి ట్రైయ్ చేయండి.
ఆలోచించడం: మీరు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకటికి రెండు సార్లు నిదానంగా ఆలోచించి ఆ పనిని చేయండి. సెల్ఫ్ టాక్‌కి టైమ్ ఇవ్వండి. ఇలా ఆలోచించడం వల్ల మీ మైండ్‌లో నెగిటివ్ ఉంటే..దానిని పాజిటివ్‌గా మార్చుకోవచ్చు.