కింగ్ కోబ్రాను నమిలి మింగేసే జంతువులు ఇవే...

జంతు రాజ్యంలో కింగ్ కోబ్రా విషం, గంభీరత్వంతో ఇతర జంతువులను భయపెడుతాయి. కనబడితేనే పారిపోయేలా భయాన్ని కలిగిస్తాయి. అయితే నాగుపాముకు కూడా చుక్కలు

Update: 2024-07-09 07:50 GMT

దిశ, ఫీచర్స్ : జంతు రాజ్యంలో కింగ్ కోబ్రా విషం, గంభీరత్వంతో ఇతర జంతువులను భయపెడుతాయి. కనబడితేనే పారిపోయేలా భయాన్ని కలిగిస్తాయి. అయితే నాగుపాముకు కూడా చుక్కలు చూపించే యానిమల్స్ ఉన్నాయి. ముక్కలు ముక్కలుగా చేసి చంపి పడేస్తామనే వార్నింగ్ ఇస్తుంటాయి. అలాంటి జంతువుల గురించి తెలుసుకుందాం.

ముంగీ

ఈ చిన్న క్షీరదం కోబ్రాను వేటాడటంలో ప్రసిద్ధి చెందింది. అమేజింగ్ స్కిల్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. ఈ జంతువు నాగు పాము దాడులను తట్టుకోగలదు. ఎదుర్కోగలదు. తిరిగి దాడి చేసి భయపెట్టగలదు. చంపేయగలదు కూడా.

హనీ బాడ్జర్

భయంలేని ఈ భయంకరమైన జంతువు తనకంటే చాలా పెద్ద పామును వేటాడగలదు. దీని మందపాటి చర్మ నాగుపాము విషానికి నిరోధకతను కలిగి ఉంటుంది. కుట్టినా సరే పాయిజన్ పని చేయదు.

సెక్రటరీ బర్డ్స్

ఈ పొడుగు కాళ్ళ ఆఫ్రికన్ మాంసాహార పక్షులు నాగుపములను తొక్కేస్తాయి. పదునైన టాలన్ లతో ప్రాణాంతకమైన దెబ్బతీస్తాయి. వీటి వేటతో జనాలను ఆశ్చర్య పరుస్తాయి .

ముళ్ల పంది

ఈ స్పైకీ క్షీరదాలు ఆశ్చర్యకరంగా చాలా చురుకైనవి. పామును చూసిన వెంటనే దాడి చేసి చంపేస్తాయి. అందుకే వీటికి ఎదురుపడేందుకు జంకుతుందట నాగుపాము.

స్నేక్ ఈగిల్

ఆకాశంలో ఎగిరే ఈ వేట పక్షులు అసాధారణమైన దృష్టితో ఉండే అమేజింగ్ బర్డ్స్. భూమిపై పాకుతున్న పాములను మట్టితో సహా లాగేసుకునే సామర్థ్యం ఉన్న పదునైన టాలన్ లను కలిగి ఉంటాయి. స్నేక్ లను మింగేస్తాయి.

అడవి పంది

ఈ మందపాటి చర్మం గల జంతువులు దూకుడుగా ఉంటాయి. ప్రత్యేకంగా కోబ్రాను వేటాడేతత్వం లేనప్పటికీ ఎదురుపడితే మాత్రం వాటిని ఎదుర్కొని తింటాయి.


Similar News