బ్రిడ్జీ పైనుండి గంగలో దూకిన 75 ఏళ్ల వృద్ధురాలు.. విస్మయంతో విజిల్స్! (వీడియో)
హర్యానాలోని సోనిపట్‌లోని బందేపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు. An old woman diving into the Ganga river from a bridge.
దిశ, వెబ్‌డెస్క్ః వయసు పెరిగే కొద్దీ శారీరకంగా కాస్త బలహీనత రావచ్చేమో కానీ ఆత్మ విశ్వాసం, ధైర్యం వంటివి మాత్రం సన్నగిల్లకపోవచ్చు. ఈ 75 ఏళ్ల వృద్ధురాల్ని చూస్తే కచ్ఛితంగా అలాగే అనిపిస్తుంది. కొంత మంది వంతెన పైనుండి కింద ఉన్న నీటిలోకి చూడటానికే భయపడతారు. కానీ, హరిద్వార్‌లోని వంతెనపై నుంచి ఏకంగా గంగా నదిలోకి దూకేసింది ఈ బామ్మ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె హర్యానాలోని సోనిపట్‌లోని బందేపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ధైర్యాన్ని చూసి, నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. శెభాష్ దీదీ అంటూ చప్పుట్లు, విజిల్స్‌తో ప్రశంసిస్తున్నారు.
దీనికి సంబంధించి, ఆమె మీడియాతో మాట్లాడుతూ.., తాను చాలా కాలంగా ఇలా చేస్తున్నాననీ, నదిలోకి దూకడం చిన్ననాటి నుండి అలావాటేనని అన్నారు. అయితే, తాను దూకిన తర్వాత ఇంకెవ్వరూ తనను అనుసరించకుండా అక్కడి వారు చూసుకున్నారని చెప్పారు. ఇక, నీటి మట్టం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆమె సహాయం లేకుండా సురక్షితంగా నది ఒడ్డుకు చేరుకోవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేశారు. ఆమె అద్భుతమైన స్విమ్మర్ అని, వైరల్‌గా మారిన ఈ వీడియో అందరినీ ఉలిక్కిపడేలా చేసిందని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. మీరూ చూడండి..
वीडियो देखकर मैं पहले तो चौंक गया पर दादीजी तो माहिर तैराक निकलीं. वे करीब 70 साल की हैं. जिस दिलेरी और उत्साह से उन्होंने हर की पौड़ी पुल से गंगा में छलांग लगाई और तैरते गयीं वह अविश्वसनीय है.
— Dipanshu Kabra (@ipskabra) June 28, 2022
वाकई उम्र आपको कभी भी कुछ भी करने से नहीं रोक सकती. pic.twitter.com/iC1Z9extwN