గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఓల్డెస్ట్ గోల్డ్ ఫిష్.. ఎందుకో తెలుసా?

మనుషులే కాదు, కొన్నిసార్లు జంతువులు, జలచరాలు కూడా తమ ప్రత్యేక లక్షణాలవల్ల ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంటాయి. మానవులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటివాటిలో టిష్ అనే పురాతన గోల్డ్ ఫిష్ కూడా ఒకటి

Update: 2023-08-11 06:05 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులే కాదు, కొన్నిసార్లు జంతువులు, జలచరాలు కూడా తమ ప్రత్యేక లక్షణాలవల్ల ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంటాయి. మానవులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటివాటిలో టిష్ అనే పురాతన గోల్డ్ ఫిష్ కూడా ఒకటి. దగ దగా మెరిసే బంగారపు వర్ణంలో ఉండే ఈ అరుదైన చేపలు కొన్ని దశాబ్దాల కిందట ఎక్కువగా కనిపించేవి. ప్రజెంట్ అవి చాలా వరకు కనబడట్లేదు. సముద్రాల్లో కూడా అరుదుగానే ఉంటున్నాయి.

టిష్ చేపలు గోల్డ్ కలర్‌లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ యూకేలోని నార్త్ యార్క్‌షైర్‌లో నివాసం ఉంటున్న హిల్డా హ్యాండ్ అనే మహిళ, ఆమె కుమారుడు పీటర్ ఎంతో ప్రేమగా 43 ఏళ్ల నుంచి గోల్డ్ ఫిష్‌ను పెంచుకుంటున్నారు. అయితే ఇది దాని సహజమైన గోల్డ్ కలర్ నుంచి క్రమంగా సిల్వర్ కలర్‌లోకి మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక సాధారణ గోల్డ్ ఫిష్ (Carassius auratus) సగటు జీవితకాలం 10 నుంచి15 సంవత్సరాలు, కానీ సదరు టిష్ అని పిలువబడే మగ గోల్డ్‌ఫిష్ మాత్రం 43 ఏళ్లకు పైగా జీవించడమేగాక, దాని రంగు సిల్వర్ కలర్‌లోకి మారడం కారణంగా గిన్నిస్ రికార్డ్‌ను నమోదు చేసింది. నిజానికి ఈ టిష్ చేపను తాను 1956లో ‘ఫెయిర్‌గ్రౌండ్ రోల్-ఎ-పెన్నీ స్టాల్‌’లో టిష్‌ను బహుమతిగా గెలుచుకున్నట్లు దాని పెంపకం దారు హిల్డా హ్యాండ్ పేర్కొన్నది.

Read More:   బంగారాన్ని పింక్ కలర్ పేపర్‌లోనే ఎందుకు చుట్టి ఇస్తారో తెలుసా? 

Tags:    

Similar News