Black Coffee : వర్షంలో బ్లాక్ కాఫీ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆనందించే బ్లాక్ కాఫీ.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్రీమ్, పాలు, స్వీటెనర్‌ల వంటివి లేకుండా.. గొప్ప రుచి, ఉత్తేజపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.

Update: 2024-07-27 09:56 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆనందించే బ్లాక్ కాఫీ.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్రీమ్, పాలు, స్వీటెనర్‌ల వంటివి లేకుండా.. గొప్ప రుచి, ఉత్తేజపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. మానసిక స్థితి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి.. ఇన్ స్టంట్ ఎనర్జీని అందిస్తుంది. కాగా కాఫీ బేస్డ్ డ్రింక్స్ కు ఆధారమైన ఈ పానీయం అందించే మరిన్ని అమేజింగ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

అల్జీమర్స్ నివారణ

బ్లాక్ కాఫీ అత్యంత విలువైన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం. కాగా ఈ పానీయం అభిజ్ఞా రుగ్మతలను తగ్గించే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. మధ్యవయస్కులు ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు సార్లు బ్లాక్ కాఫీ తీసుకున్నట్లయితే.. తరువాతి సంవత్సరాల్లో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 65 శాతం తగ్గింది. అయితే అంతకు మించిన వినియోగం వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. చిత్త వైకల్యం ప్రమాదాన్ని 53 శాతం పెంచుతుంది.

మూడ్‌ బూస్టర్

కాఫీలో ఉన్న స్టిమ్యులేటింగ్ లక్షణాలు మూడ్ బూస్టర్ గా పనిచేస్తాయి. కాఫీలో ఉండే కెఫీన్ .. అలసట భావాలను తగ్గించి, చురుకుదనాన్ని పెంపొందిస్తుంది. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా రెగ్యులర్ కాఫీ వినియోగం.. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వెయిట్ మేనేజ్మెంట్

కాఫీలోని కెఫిన్ బరువు నియంత్రణలో సహాయపడుతుందని నివేదికలు చెప్తున్నాయి. కాఫీ, టీ తీసుకోవడం తగ్గించిన వారితో పోలిస్తే కెఫిన్ పానీయాలు ఎక్కువగా తీసుకునే వ్యక్తులు బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని గత అధ్యయనం గుర్తించింది. భోజనానికి 30 నిమిషాల నుంచి నాలుగు గంటల ముందు కెఫిన్‌తో కూడిన పానీయాలు తీసుకోవడం వల్ల ఆహార వినియోగం తగ్గుతుందని మరో అధ్యయనం వెల్లడించింది.

లివర్ సిర్రోసిస్ ప్రమాదం తగ్గుదల

కాఫీ తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. రోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగడం వల్ల ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని 80 శాతం తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాదు సాధారణ కాఫీ వినియోగంతో నాన్-ఆల్కహాలిక్ సిర్రోసిస్ ప్రమాదాన్ని 30 శాతం వరకు తగ్గించవచ్చు.

యాంటీడిప్రెసెంట్‌

కాఫీ యాంటీడిప్రెసెంట్ గా వర్క్ చేస్తుంది. ఇది తీసుకున్నాక మెదడులో సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ న్యూరోట్రాన్స్మిటర్లు మానసిక స్థితిని నియంత్రించడంలో.. డిప్రెషన్ తగ్గించడంలో.. విచారం, ఒంటరితనం లక్షణాల నుంచి విముక్తి కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

డయాబెటిస్, క్యాన్సర్ రిస్క్ తగ్గుదల

బ్లాక్ కాఫీ మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించవచ్చని.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగ్గా నియంత్రించడానికి దారితీస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాదు హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను కాపాడుతుంది. రొమ్ము, కొలొరెక్టల్, కాలేయ క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నాయి.

Tags:    

Similar News