ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న అద్భుతమైన జంతువులు.. పైగా మెడల్స్ కూడా.. ఈ 5 జంతువులేంటో తెలిస్తే షాక్?

1914-1918 అండ్ 1939-1945 మధ్యలో జరిగిన రెండు ప్రపంచ యుద్దాల గురించి అందరికీ తెలిసిందే.

Update: 2024-08-18 15:44 GMT

దిశ, ఫీచర్స్: 1914-1918 అండ్ 1939-1945 మధ్యలో జరిగిన రెండు ప్రపంచ యుద్దాల గురించి అందరికీ తెలిసిందే. మొదటి ప్రపంచ యుద్ధంలో 17 మిలియన్ల మంది మరణించగా.. 25 మిలియన్ల మంది గాయపడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధంలో 60 మిలియన్లకు పైగా ప్రజలు మరణించడం గమనార్హం.ఇది మానవ చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి ఘోరమైన యుద్ధంలో ఎలుకు బంట్లు, కుక్కలు, సముద్రంలో ఉండే డాల్ఫిన్స్, పావురాలు కూడా పాల్గొన్నాయట. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న 5 జంతువుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వాజ్టెక్‌(ఎలుగు బంటి): వాజ్టెక్ అనే ఎలుగుబంటి రెండోవ ప్రపంచ యుద్ధంలో పాల్గొందట. పేలుడు పదార్థాలు మోసేందుకు బాగా ఉపయోగపడిందట.పాలిష్ దేశ సైనికులు దీన్ని దత్తత తీసుకున్నారట.

సార్జంట్ రెక్‌లెస్: సార్జంట్ రెక్‌లెస్ అనే జంతువు కొరియా దేశానికి చెందిన యుద్ధంలో పాల్గొందట. ఈ గుర్రం మంగోలియన్ కు జాతికి చెందినది. యుద్ధంలో గాయపడిన సైనికులను సురక్షితంగా గమ్యానికి చేర్చిందట. సార్జంట్ రెక్‌లెస్ కు ర్యాంక్ తో పాటు ఎన్నో మెడల్స్ కూడా వచ్చాయట.

చెర్‌ ఎమీ(పావురం): చెర్ ఎమీ అనే పాపురం ఫస్ట్ వరల్డ్ వార్ లో గాయపడిన 200 మంది సైనికులను రక్షించిదట. ఈ పాపురం కూడా గాయపడనప్పటికీ సైనికాధికారులకు సమాచారం చేరవేసిందట.

మిలిటరీ డాల్ఫిన్స్‌: సముద్రంలోని నీటి అడుగున శత్రువులు దాచిన మైన్స్ ను గుర్తించడానికి మిలిటరీ డాల్ఫిన్స్ ఎంతో సహాయం చేశాయట. అంతేకాకుండా యుద్ధ నౌకలను కాపాడేందుకు ఈ డాల్ఫిన్స్ ద్వారా సమాచారం సేకరించేవారట. వీటికి అమెరికాకు చెందిన నేవీ దళం ట్రైనింగ్ కూడా ఇచ్చాయట.

సర్జెట్ స్టబ్జీ (కుక్క):కుక్క ప్రపంచ యుద్ధాల్లో పాల్గొందంటే సాధారణంగా ఎవరూ నమ్మరు. కానీ సర్జెట్ స్టబ్బీ అనే కుక్క రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోగా నిలిచిందట. శత్రు దేశాలు వేసిన గ్యాస్ దాడుల నుంచి అమెరికా సైన్యాన్నిచాలా సార్లు రక్షించిందట. ఈ కుక్క 1916 లో పుట్టిందట. రెండో ప్రపంచ యుద్ధం సమయం నాటికి 18 నెలలు మాత్రమేనట.

Tags:    

Similar News