బెల్ట్ టైట్‌గా పెట్టుకునేవారికి అలర్ట్.. ఆ సమస్యలు తలెత్తే చాన్స్!

ఒకప్పుడు చాలామంది అవసరం ఉంటేనే బెల్ట్‌ని ఉపయోగించేవారు.

Update: 2024-11-10 12:40 GMT

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు చాలామంది అవసరం ఉంటేనే బెల్ట్‌ని ఉపయోగించేవారు. కానీ, ఈ రోజుల్లో చాలామంది స్టైల్‌గా కనపడడానికి దీనిని వాడుతున్నారు. ఇప్పుడు బెల్ట్ పెట్టుకోవడం అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఏ డ్రస్‌ మీద అయినా బెల్ట్ పెట్టుకుంటున్నారు. పురుషులతో పాటుగా స్త్రీలు కూడా వీటిని ధరిస్తున్నారు. కొందరు బెల్ట్ లేకుండా జీన్స్‌, ఫార్మల్ ప్యాంట్లు ధరిస్తారు. మరికొందరు ప్యాంట్ ఫిట్టింగ్ కోసం బెల్ట్ వాడుతుంటారు. మీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉంటే, ఆ అలవాటును తప్పనిసరిగా మార్చుకోండి. ఎందుకంటే దీని వలన చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఈ సమస్య వస్తుంది:

కొందరు నడుము దగ్గర చాలా టైట్‌గా పట్టే ప్యాంటును వాడుతుంటారు. అవసరం లేకున్నా కానీ బెల్ట్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల నడుము, పొత్తి కడుపులో తిమ్మిరి కలుగుతుంది. టైట్‌గా బెల్ట్ పెట్టుకోవడం వల్ల పొట్టపై ఒత్తిడి కలిగిస్తుంది. దీని వల్ల పొట్టలోని ఆమ్లం గొంతులోకి చేరి, కొన్నిసార్లు ఎసిడిటీ సమస్యలు వచ్చే చాన్స్ ఉంటుంది. అమ్మాయిలు కూడా నడుము దగ్గర టైట్‌గా ఉన్న ప్యాంట్ వేసుకున్నా లేదా టైట్‌గా ఉండే బెల్ట్ పెట్టుకున్నా పొట్టపై ఒత్తిడి పెరిగి.. వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నరాల సమస్యతో పాటుగా గుండెలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ కావొచ్చు.

ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బెల్ట్‌ను టైట్‌గా ధరించకపోవడం మంచిది. 

Tags:    

Similar News