అలర్ట్: ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డట్టే..

కరోనా అనే మహమ్మారీ వచ్చినప్పటినుంచి చాలా కంపెనీలు ఎంప్లాయిస్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫ్షన్ ఇచ్చింది.

Update: 2024-09-21 02:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా అనే మహమ్మారీ వచ్చినప్పటినుంచి చాలా కంపెనీలు ఎంప్లాయిస్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చింది. ఇప్పటికీ చాలా మంది దానినే కంటిన్యూ చేస్తున్నారు. దీంతో సమయం సందర్భం అని తేడా లేకుండా పని చేసేస్తున్నారు. ఈ క్రమంలో ల్యాప్‌టాపే సర్వస్వం అయిపోయింది. అందులో భాగంగా చాలా మంది ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకొని వర్క్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

పురుషులలో వంధ్యత్వం

ల్యాప్‌టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం శరీరం లోపల ఉంటుంది. పురుషులలో పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్‌టాప్‌లు వాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో సమస్యలు ఏర్పడుతాయి.

వైఫై ద్వారా రేడియేషన్

ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

కండరాల నొప్పులు

ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్‌పై పెట్టుకొని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్‌టాప్ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో నొప్పిని కలిగిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


Similar News