చేతిరాతను దింపేస్తున్న AI..స్టూడెంట్స్ హోం వర్క్, రికార్డ్స్ రాసే పనే లేదు.. సింపుల్‌గా ఇలా చేస్తే..

సాధారణంగా చిన్న పిల్లలు హోమ్ వర్క్ చేయాలంటే ఇంట్లో మారాం చేస్తారు. ఇచ్చిన పని చేయలేదు కాబట్టి తర్వాతి రోజు టీచర్ చేతిలో దెబ్బలు తప్పవు. అలా

Update: 2024-08-05 15:09 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా చిన్న పిల్లలు హోమ్ వర్క్ చేయాలంటే ఇంట్లో మారాం చేస్తారు. ఇచ్చిన పని చేయలేదు కాబట్టి తర్వాతి రోజు టీచర్ చేతిలో దెబ్బలు తప్పవు. అలా రోజూ జరిగితే పాపం బిడ్డ అనుకుని తల్లిదండ్రులే ఆ పని పూర్తి చేస్తారు. అది కూడా తమ పిల్లల హ్యాండ్ రైటింగ్ పోలి ఉండేలా కష్టపడతారు. ఇక కాలేజ్ స్టూడెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. రికార్డులు రాసేందుకు తంటాలు పడుతుంటారు. ఒకే హ్యాండ్ రైటింగ్ ఉండాలి కాబట్టి స్నేహితులతో, ఇంట్లో కుటుంబ సభ్యులతో రాయించుకోలేక తప్పక మనసొప్పకపోయినా స్వయంగా కంప్లీట్ చేసుకుంటారు.

అయితే ఇలాంటి విద్యార్థులకు ఇకపై నో మోర్ ప్రాబ్లమ్ అంటున్నాడు కేరళకు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ దేవదత్ PR. సొంత చేతిరాతను రాసే AI మెషిన్ ను ఆవిష్కరించిన ఆయన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ మెషిన్ కస్టమర్ హ్యాండ్ రైటింగ్ స్టైల్ తెలుసుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. సదరు విద్యార్థి రాసే పాటర్న్ క్యాచ్ చేస్తుంది. జస్ట్ స్మాల్ డిఫరెన్స్ తో ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తుంది.


(Video Credits News Blare Media Instagram Channel)

Tags:    

Similar News