Viral: అన్నీ వదిలేసి 8 గంటల పాటు మంచంపై పడుకుని.. రూ.లక్ష గెలుచుకుంది.. ఆమె ఎవరో తెలుసా?

ఖాళీ సమయం దొరికితే చాలు యూట్యూబ్ లో సినిమాలు చూడటం లేదా ఫోన్లలో వీడియోలు చూడటం వంటివి చేస్తున్నారు.

Update: 2024-12-16 04:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు యూట్యూబ్ లో సినిమాలు చూడటం లేదా ఫోన్లలో వీడియోలు చూడటం వంటివి చేస్తున్నారు. మనం రోజూ ఆహారాన్ని సమయానికి ఎలా తీసుకుంటామో .. వీటిని కూడా టైం ప్రకారం అలాగే వాడుతున్నాము. కొంతమంది అయితే ఫోన్లలో ఒకసారి మొఖం పెడితే పక్కనే ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. అలాంటిది 8 గంటల పాటు ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు చూడకుండా ఓ ఒక మహిళ మంచంపై పడుకుని .. రూ లక్ష గెలుచుకుంది.  

చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలీటీలో ఓ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొనేవారు స్మార్ట్ ఫోన్స్ వాడకుండా  8 గంటల పాటు బెడ్ పై ఉండాలి. టాయిలెట్ బ్రేక్‌లకు తప్ప మంచం విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ పోటీలో మొత్తం 100 మంది పాల్గొన్నారు.

అయితే, ఇక్కడ ఒక రూల్ పెట్టారు. ఈ పోటీలో పాల్గొనేవారు మంచం పై కళ్ళు మూసి పడుకోవడానికి వీల్లేదు. అలాగే, ఏ విషయాలకు ఒత్తిడి తీసుకోకూడదు. అంతేకాకుండా, చేతికి ఒక మెషిన్ పెట్టి ఉంచారు. కాగా, ఈ పోటీలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోగా .. ఒక మహిళ మాత్రం 100కి 88.99 మార్కులు సాధించింది. ఈ పోటీలో గెలిచినందుకు ఆమెకు రూ. 1.2 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది.‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News